గద్వాల టౌన్, వెలుగు: 18 ఏండ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. బుధవారం ఎస్పీ ఆఫీస్లో ఆపరేషన్ స్మైల్ కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జనవరి నెలలో జిల్లాలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెండు ప్రత్యేక పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తాయని తెలిపారు. డీడబ్ల్యూవో, సీడబ్ల్యూసీ, డీఎల్వో తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తారన్నారు. డీఎస్పీ మొగులయ్య, సీడబ్ల్యూసీ చైర్మన్ సహదేవుడు, సీడీపీవో దీప్తి తదితరులు పాల్గొన్నారు.
