భూ ఆధార్ సర్వేను త్వరగా కంప్లీట్ చేయండి : అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్

భూ ఆధార్ సర్వేను త్వరగా కంప్లీట్ చేయండి : అడిషనల్  కలెక్టర్  మధుసూదన్ నాయక్

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: మహబూబ్​నగర్  జిల్లా గండీడ్  మండలం సాలార్ నగర్  గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ ఆధార్  సర్వే పైలట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని అడిషనల్  కలెక్టర్  మధుసూదన్ నాయక్  ఆదేశించారు.బుధవారం తన ఛాంబర్​లో సంబంధిత అధికారులతో మీటింగ్​ నిర్వహించారు. 

ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని భూమి వివరాలను స్పష్టమైన సరిహద్దులతో, ఖచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలతో గుర్తించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆర్డీవో నవీన్, సర్వే ల్యాండ్  ఏడీ అశోక్  పాల్గొన్నారు.