నిరంతర సాధనతో విజయాలు : శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్

నిరంతర సాధనతో విజయాలు : శ్రీరాంపూర్ ఏరియా జీఎం శ్రీనివాస్
  •     శ్రీరాంపూర్​ ఏరియా జీఎం శ్రీనివాస్​
  •     రెండో రోజు కొనసాగిన సింగరేణి కంపెనీ లెవల్​అథ్లెటిక్స్​పోటీలు

కోల్​బెల్ట్/నస్పూర్, ​వెలుగు: క్రీడల్లో గెలుపోటములు సహజమని, నిరంతర సాధనతో విజయాలు సాధ్యమని శ్రీరాంపూర్ ​ఏరియా సింగరేణి జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్​ఏరియాలోని శాంతి మైదానంలో వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి కంపెనీ లెవల్​అథ్లెటిక్స్, త్రోబాల్, స్విమ్మింగ్​పోటీలు బుధవారం ముగిశాయి. ముగింపు వేడుకలకు జీఎం చీఫ్​గెస్ట్​గా హాజరై విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి కంపెనీ లెవల్​అథ్లెటిక్స్​పోటీల్లో ఉద్యోగులు పట్టుదల, క్రమశిక్షణతో ఆడడం అభినందనీయమన్నారు. కోల్ ఇండియా స్థాయి పోటీల్లోనూ రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వోటు జీఎం, స్పోర్ట్స్​వైస్​ప్రెసిడెంట్​ఎన్.సత్యనారాయణ, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ప్రెసిడెంట్ ​ఎస్కే బాజీసైదా, ఆఫీసర్స్​ సంఘం ప్రెసిడెంట్​ కె.వెంకటేశ్వర్ ​రెడ్డి, డీజీఎం (పర్సనల్)​ అనిల్ ​కుమార్, స్పోర్ట్స్​ఆఫీసర్లు, స్పోర్ట్స్ సూపర్​వైజర్, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.