హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఓ రేంజ్ లో జరిగాయి. ముఖ్యంగా మద్యం ప్రియులు.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు డిసెంబర్ 31 సాయంత్రం నుంచే సిట్టింగ్ లు మొదలుపెట్టారు. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ జనవరి 01 మధ్య రాత్రి వరకు ఊపు ఊపేశారు. దీంతో ఒక్కరోజులోనే మందు సేల్స్ భారీగా జరిగాయి.
కొత్త సంవత్సరం సందర్భంగా మందు తాగి రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. డ్రంకెన్ డ్రైవ్ లు నిర్వహించి చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసిన మందుబాబులు మాత్రం లెక్క చేయకుండా.. తాగి రోడ్లపైకి వచ్చారు. దీంతో తనిఖీల్లో మూడు కమిషనరేట్ల పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డారు మందుబాబులు.
►ALSO READ | సిగరెట్ ధర.. బంగారం, వెండి లెక్కన పెరగబోతుందా.. దమ్ము కొట్టాలంటే దండిగా డబ్బులుండాల్సిందేనా..!
మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2731 మంది మందుబాబులు తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. పట్టుబడ్డ అందరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1198 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో 605 మంది మద్యం తాగి వాహనలు నడుపుతూ పట్టుపడ్డారు. మొత్తంగా న్యూఇయర్ కిక్కులో దాదాపు 3 వేల మంది పట్టుబడడ్డట్లు పోలీసులు వెల్లడించారు.
