రైల్వే ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ రికార్డ్.. అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం..

 రైల్వే ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ రికార్డ్..  అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గం..

రిషికేశ్– కర్ణప్రయాగ రైల్వే అనుసంధాన ప్రాజెక్టులో ఎల్ అండ్ టీ సంస్థ గడువు కంటే ఒక రోజు ముందే లక్షిత సొరంగ మార్గం తవ్వకం పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇందుకోసం కఠినమైన రాతి నేలలోనూ సొరంగం తవ్వే టీబీఎం యంత్రాన్ని ఉపయోగించింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో రెండు శక్తిమంతమైన టీబీఎంలను ఎల్ అండ్ టీ ఉపయోగించింది. 70 శాతం సొరంగాలను టీబీఎం యంత్రాలతో తొలిచారు. మొదటి టీబీఎంకు శక్తి అని పేరు పెట్టారు. శక్తి 2025, ఏప్రిల్ 16 నాటికి 10.47 కి.మీ.ల సొరంగాన్ని గడువు కంటే 12 రోజుల ముందే తవ్వేసింది. రెండో టీబీఎం గడువు కంటే ఒకరోజు ముందు జూన్ 29 నాటికి 10.29 కి.మీ.ల సొరంగ తవ్వకాన్ని పూర్తిచేసిందని ఎల్ అండ్ టీ డైరెక్టర్ ఎస్.వి.దేశాయ్ వెల్లడించారు. శక్తి తవ్వనున్న మొదటి సొరంగం పొడవు 14.57 కి.మీ.లు కాగా, శివ సాయంతో 13.09 కి.మీ.ల పొడవు ఉన్న రెండో సొరంగం పూర్తిచేయనున్నారు. ఈ రెండూ దేశంలో అత్యంత పొడవైన రైల్వే సొరంగ మార్గాలు.

►ALSO READ | నిరుద్యోగులకు ఉద్యోగావకాశం.. పీజీఐఎంఈఆర్ లో గ్రూప్–బి, సి పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండి..