యూపీ వారియర్స్ కెప్టెన్‌‌గా లానింగ్‌‌

యూపీ వారియర్స్ కెప్టెన్‌‌గా లానింగ్‌‌

ముంబై: విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌‌) నాలుగో సీజన్‌‌లో యూపీ వారియర్స్‌‌ను ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మెగ్ లానింగ్ నడిపించనుంది. గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌‌ టీమ్‌‌ను ఫైనల్ చేర్చిన లానింగ్‌‌కు యూపీ  ఫ్రాంచైజీ కెప్టెన్సీ అప్పగించింది. ఇటీవల జరిగిన వేలంలో రూ. 1.9 కోట్లకు లానింగ్‌‌ను దక్కించుకున్న  వారియర్స్ ఎంతో అనుభవం కలిగిన ఆమె నాయకత్వంలో ఈసారి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆస్ట్రేలియా తరఫున ఏడుసార్లు వరల్డ్ కప్స్‌ విన్నర్‌‌‌‌గా రికార్డు ఉన్న లానింగ్ నియామకంపై హెడ్ కోచ్ అభిషేక్ నాయర్ హర్షం వ్యక్తం చేశాడు.  ఈ నెల 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు నాలుగో సీజన్‌‌ జరగనుంది.