ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన లసిత్ మలింగ

V6 Velugu Posted on Sep 14, 2021

శ్రీలంక ఫేస్ లెజెండ్  లసిత్ మలింగ ఇంటర్నేషనల్ టీ 20లకు  గుడ్ బై చెప్పాడు. 2011లో టెస్టు క్రికెట్ కు..2019 లో వన్డేలకు వీడ్కోలు పలికాడు మలింగ. లేటెస్ట్ గా టీ20లకు గుడ్ బై చెప్పాడు. యార్కర్ స్పెషలిస్గ్ గా పేరుగాంచిన మలింగ పేరిట చాలా రికార్డ్ లు సృష్టించాడు. మలింగ 84 అంతర్జాతీయ టీ 20లు ఆడి 107 వికెట్లు, 228 వన్డేల్లో 338 వికెట్లు, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 546 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. 

మలింగ్ కెప్టెన్సీలో శ్రీలంక 2014లో టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అంతేగాకుండా ప్రాంఛైజీ క్రికెట్లు ఐపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్ ల్లో నుండి కూడా తప్పుకున్నాడు. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది. నన్ను ప్రోత్సహించిన వారందరకి ధన్యవాదాలు. నా అనుభవాన్ని యువ క్రికెటర్లతో పంచుకుంటా‘అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు మలింగ.

 

Tagged malinga, Lasith Malinga announces , T20 retirement, mumbaiindiains

Latest Videos

Subscribe Now

More News