రేపటితో ముగియనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు

రేపటితో ముగియనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆఖరి విడతలో ఆజంఘడ్, మావు, జౌన్‌పూర్, ఘాజీపూర్, చందౌలీ, వారణాసి, మీర్జాపూర్, బదోహి, సోన్‌భద్ర జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. వీటిలో 11 షెడ్యూల్ కులాలు, 2 సీట్లు షెడ్యూల్ తెగలకు కేటాయించారు. 2.06కోట్ల మంది ఓటర్లు 613 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని రెండు రోజుల పాటు వారణాసిలోనే ఉండి ప్రచారం నిర్వహించారు. 

2017లో ప్రస్తుతం చివరి దశ ఎన్నికలు జరుగుతున్న 54 నియోజకవర్గాల్లో 29 బీజేపీ ఖాతాలో వేసుకోగా.. , సమాజ్ వాదీ పార్టీ 11, అప్నాదళ్ 4, ఎబీఎస్పీ 3 సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఆరు విడతల్లో 349 సీట్లలో ఓటింగ్ ముగిసింది. సోమవారం రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. రేపటితో ఐదు రాష్ట్రాలకు సంబంధించి రెండు నెలలుగా జరుగుతున్న పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

For more news..

అలల తాకిడికి దెబ్బతిన్న వంతెన

రూమ్ నెం.1046 లో ఏం జరిగింది?.. ఇప్పటికీ మిస్టరీనే..