కవాడిగూడ కార్పొరేటర్గా లాస్య నందిత రాజకీయాల్లోకి..

కవాడిగూడ కార్పొరేటర్గా లాస్య నందిత రాజకీయాల్లోకి..

కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత ఘోర రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. పటాన్ చెరు ORRపై లాస్యనందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో  కారు డ్రైవర్ ఆకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి.  

అతన్ని మదీనాగూడలోని శ్రీకర హాస్పిటల్ కు తరలించారు. ఆకాశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత సాయన్న కుమార్తె నందిత మృతితో కుటుంబసభ్యులు, అభిమానులు, పార్టీ నేతలు కన్నీమున్నీరవుతున్నారు.

2015లో రాజకీయాల్లోకి వచ్చారు లాస్య నందిత. అప్పుడు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డ్ పికెట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2016లో తన తండ్రి సాయన్నతో పాటు బీఆర్ఎస్ లో చేరారు. 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్ గా గెలిచారు లాస్యనందిత. అయితే 2021లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న 2023 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో చనిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోను నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇప్పుడు పటాన్ చెరు ఓఆర్ఆర్ పై జరిగిన ప్రమాదంలో చనిపోయారు లాస్య నందిత.