
గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తనయుడు, బీజేపీ నేత ఉత్పల్ పారికర్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై శనివారం మాట్లాడుతూ.. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, లక్షణాలేవీ లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉంటానని చెప్పారు. అయితే ఆదివారం సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ” వైద్యుల సలహా మేరకు ఇప్పుడు ఆసుపత్రిలో చేరాను. నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఉత్పల్ పోస్ట్ చేశారు. కాగా గోవాలో కరోనా కేసుల సంఖ్య 11,339కు చేరింది. అందులో 7,488 మంది కరోనా నుంచి కోలుకోగా.. మరణాల సంఖ్య 98కి చేరింది.