ప్రభాస్, బన్నీ బాబాల వేషంలో ఎలా ఉంటారు

ప్రభాస్, బన్నీ బాబాల వేషంలో ఎలా ఉంటారు

అర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్ (Artificial Intelligence-AI) వచ్చాక రోజుకో అప్ డేట్, ఆశ్చర్యపోయే వార్తలు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. ఇటీవలే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. వివిధ వృత్తుల్లో ఎలా ఉంటారో.. వాటికి సంబంధించిన ఫొటోలను రూపొందించిన ఏఐ.. మొన్నటికి మొన్న ఆదిపురుష్ లో నటించిన ప్రభాస్, కృతి సనన్ లను రాముడు, సీత పాత్రలో ఎలా ఉంటారో చూపించింది. ఈ ఏఐ జనరేటెడ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కూడా మారాయి. తాజాగా పలువురు స్టార్ హీరోస్ బాబా, స్వామీజీ వేషాల్లో ఎలా ఉంటారో ఏఐ చూపించింది.

రామ్ చరణ్

ఏఐ రూపొందించిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఇమేజ్ లో ఆయన బాబా వేషంలో కనిపిస్తున్నారు. మెడలో పూసల దండలు వేసుకుని, స్టైలిష్ హెయిర్ స్టైయిల్ తో కనిపిస్తున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను కూడగట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో అన్ని భాషల్లో విడుదల కానుంది.

ప్రభాస్

నుదురు నుంచి పాపిటి వరకు పొడవాటి పసుపు బొట్టుతో కనిపిస్తోన్న రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రాన్ని ఏఐ రూపొందించింది. ఈ పిక్ లో ప్రభాస్ చెవికి రింగులు, మెడలో పూల దండతో సన్నని చిరునవ్వుతో అలరిస్తున్నారు. ఇటీవలే ఆదిపురుష్ తో అలరించిన ప్రభాస్.. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ సలార్ తో సెప్టెంబర్ 2023లో ప్రేక్షకుల ముందురకు రాబోతున్నారు.

ధనుష్

స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎన్ఐఆర్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమిళ నటుడు ధనుష్.. ఏఐ రూపొందించిన చిత్రంలో మెడలో బంతి పూల దండలతో కనిపిస్తున్నారు. పొడవాటి గడ్డం, ముఖానికి ఎర్రటి పొడవు బొట్టుతో నవ్వుతూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కెప్టెన్ మిల్లర్ అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

అల్లు అర్జున్

తెల్లటి పొడవాటి హెయిర్, గడ్డంతో కనిపిస్తోన్న ఈ అల్లు అర్జున్ చిత్రాన్ని ఏఐ తయారుచేసింది. ఈ ఫొటోల్లో మెడలో రుద్రాక్షలా ఉండే పూసల దండలతో స్వామిజీ లేదా బాబా వేషధారణలో కనిపిస్తున్నారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న్ ఈ ఫొటో వైరల్ గా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి థియేటర్లలోకి రానుంది.

జూనియర్ ఎన్టీఆర్

అచ్చం స్వామీజీలా కనిపిస్తోన్న ఈ ఏఐ బేస్డ్ తారక్ ఇమేజ్ లో ఆయన సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. కాషాయం దుస్తులు, మెడలో రుద్రాక్ష మాలలతో ఆశ్చర్యానికి గురి చేసేలా ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియన్ ఫిల్మ్ దేవర తో బిజీగా ఉండగా.. ఆ తర్వాత సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో #NTR31 కోసం పని చేయనున్నారు.

సూర్య

ప్రశాంతమైన బాబా వేషంలో కనిపిస్తోన్న ఈ సూర్య లేటెస్ట్ చిత్రాన్ని ఏఐ రూపొందించింది. మెడలో పూల మాలలతో నవ్వుతూ కనిపిస్తున్నారు. విక్రమ్ సినిమాలో రోలెక్స్ పాత్రలో దక్షిణాది ప్రేక్షకులను అలరించిన సూర్య.. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు

అత్యంత ఆశ్చర్యాన్ని, అసలు ఆయనేనా అనేట్టు ఉన్న మహేష్ బాబుకు సంబంధించిన ఈ ఫొటోను ఏఐ రూపొందించగా.. ఈ పిక్ లో ఆయన పొడవాటి జుట్టుతో కన్ను భాగంలో చిన్న రక్తపు గాటుతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పని చేస్తున్నారు. ఆ తర్వాత త్వరలోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోయే యాక్షన్ అడ్వెంచర్ పాన్ ఇండియా సినిమాలో భాగం కానున్నారు.

కమల్ హాసన్

పొడవాటి గడ్డం, కాషాయపు బొట్టుతో ఆకర్షిస్తోన్న విశ్వ నటుడు కమల్ హాసన్.. పొడవాటి తెల్లటి గడ్డంతో ఆకట్టుకుంటున్నారు. మెడలో మెడలో రుద్రాక్ష మాలలతో కనిపిస్తుండగా.. సేమ్ స్వామీజీలా కనిపించే ఈ ఫొటో వైరల్ అవుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్.. ప్రభాస్ హీరోగా చేస్తోన్న ప్రాజెక్ట్ కె లో ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

విజయ్ సేతుపతి

తమిళంలో పలు హిట్ చిత్రాలతో అలరించిన తమిళ నటుడు విజయ్ సేతుపతి.. మెడలో బంతిపూలు, గులాబీ పూల దండలతో చిత్రంగా కనిపిస్తున్ారు. పొడవాటి గడ్డంతో కనిపిస్తూ అందర్నీ అలరిస్తున్నారు. విజయ్ సేతుపతి ఉప్పెన, మైఖేల్(కెమియా) అనే రెండు తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.