నిట్ వరంగల్లో కన్సల్టెంట్ ఖాళీలు.. జీతం 50 వేలు.. క్వాలిఫికేషన్ ఏంటంటే..

నిట్ వరంగల్లో కన్సల్టెంట్ ఖాళీలు.. జీతం 50 వేలు.. క్వాలిఫికేషన్ ఏంటంటే..

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ, వరంగల్(నిట్, వరంగల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 09.

  • పోస్టుల సంఖ్య: 5
  • పోస్టులు: విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 01, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 01, విజిటింగ్ కన్సల్టెంట్(ఆర్కిటెక్) 01, స్టూడెంట్ కౌన్సిలర్ 01, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 01.
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బి.ఆర్కిటెక్చర్, బీఈ లేదా బీటెక్, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
  • జీతం: విజిటింగ్ కన్సల్టెంట్(లీగల్ అడ్వైజర్) 50,000,  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 60,000, స్టూడెంట్ కౌన్సిలర్ 60,000, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 60,000.
  • అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
  • అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 10.
  • లాస్ట్ డేట్: జులై 09. 
  • అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 
  • సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు nitw.ac.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.