టూల్స్ గాట్జెట్స్ : హ్యాండ్​ రెయిల్​

టూల్స్ గాట్జెట్స్ : హ్యాండ్​ రెయిల్​

టూల్స్ గాట్జెట్స్ : హ్యాండ్​ రెయిల్​

పెద్దవాళ్లు కూర్చొని లేదా పడుకుని లేచిన వెంటనే చేతికి ఎటువంటి ఆధారం చిక్కకపోతే కిందపడే అవకాశం ఉంది. అలాగే చిన్న పిల్లలు కూడా. అలా పడిపోకుండా ఉండేందుకు హెల్పింగ్​ హ్యాండ్​ రెయిల్​ను తెచ్చింది హెపెక్సా కంపెనీ. హెల్పింగ్​ హ్యాండిల్​ హ్యాండ్​రెయిల్​ పిల్లలు, పెద్దలు బాత్​రూమ్​లో పడిపోకుండా కాపాడుతుంది. మల్టీ కలర్​లో దొరికే ఈ హ్యాండిల్​ను టాయిలెట్ సీట్​ మీద నుంచి లేచేటప్పుడు, షవర్​ బాత్​ చేసి బయటకు వచ్చేటప్పుడు, చెయిర్​ మీద కూర్చొని లేచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు సపోర్టుగా వాడొచ్చు. దీన్ని పెట్టేందుకు గోడను డ్రిల్​ చేయాల్సిన అవసరం లేదు.

అలాగని ఒక ప్లేస్​లో ఫిక్స్​ చేయాల్సిన పనిలేదు. సాఫ్ట్​గా ఉండే గోడల మీద పెట్టగానే కొన్ని సెకన్లలో అతుక్కుంటుంది. సక్షన్​ ఎఫెక్ట్​తో ఇది గోడలను గట్టిగా పట్టి ఉంచుతుంది. అవసరం లేనప్పుడు ఆ ప్లేస్​ నుంచి తీసేయొచ్చు. అయితే.. ఈ హ్యాండిల్​ను ఇన్​స్టాల్​ చేశాక గోడను గట్టిగా పట్టుకుందా? లేదా? అనేది గమనించుకోవడం మరిచిపోవద్దు. ప్లాస్టిక్​ మెటీరియల్​తో తయారుచేసిన దీన్ని వాడడం చాలా ఈజీ.


ధర: రూ. 329

 ఎలక్ట్రిక్​ కట్టర్

వయసు మీద పడ్డాక చిన్న పనులే అనుకున్నవి కూడా చాలా భారంగా అనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా వంటచేసే పెద్ద వాళ్లకు కూరగాయలు తరిగేందుకు ఓపిక ఉండదు చాలాసార్లు. ఆ ఇబ్బంది నుంచి తప్పించేందుకు స్కైటోన్​ బ్రాండ్​ చాపర్​ మీట్​ గ్రైండర్స్​ను తయారుచేసింది. ఇది స్టెయిన్​లెస్​ స్టీల్​ బౌల్​తో వస్తుంది​. రెండు స్పీడ్​ మోడ్స్​ ఉన్నాయి. అందులో ఒకటో నెంబర్​ను నొక్కితే స్లో స్పీడ్​తో పనిచేస్తుంది. సాధారణంగా దీన్ని మాంసాన్ని తరిగేందుకు వాడతారు.

రెండో బటన్​ వెజిటబుల్​, ఫ్రూట్స్​కి పనికొస్తుంది. ఇందులో రెండు, ఆరు లీటర్ల వెరైటీలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మల్టీ ఫంక్షనల్​ ఫుడ్​ చాపర్ ఇది. ఎలక్ట్రిక్​ మీట్​ కట్టర్​ 700 వాట్స్​ పవర్​తో నడుస్తుంది. అందుకని చాలా ఎఫెక్టివ్​గా, స్పీడ్​గా పనిచేస్తుంది. ఇందులోని నాలుగు స్టెయిన్​లెస్​ స్టీల్​ బ్లేడ్స్​ 4డి డిజైన్​తో ఉంటాయి. దానివల్ల పైన, కింద ఉన్న బ్లేడ్స్​ ఫుడ్​ని 360 డిగ్రీల యాంగిల్​లో తరుగుతుంది.ఈ కట్టర్​తో స్టెయిన్​లెస్​ స్టీల్​ బౌల్​ వస్తుంది. గ్లాస్​ బౌల్స్​తో పోల్చితే ఇది స్ట్రాంగ్​గా ఉంటుంది.  షాక్​ ప్రూఫ్​, మన్నిక ఎక్కువ.  దీన్ని వాడడం ఎంత ఈజీగా ఉంటుందో శుభ్రం చేయడం కూడా అంత ఈజీ. ఎందుకంటే ఎలక్ట్రిక్​ కట్టర్​ను డిసెంబుల్​ చేసి, శుభ్రం చేయడమే. కట్టర్​తో పాటు నాన్​ స్లిప్​ మ్యాట్​ వస్తుంది. బౌల్​ను మ్యాట్​ మీద పెట్టి తరిగే పని సులువుగా చేసుకోవచ్చన్నమాట.                              

ధర: రూ. 1,474

మెడిసిన్​ రిమైండర్​

పెద్దవాళ్లలో చాలావరకు రోజూ వేసుకునే మెడిసిన్​ను ఒక్కోసారి వేసుకోవడం మర్చిపోతుంటారు. ఇది సహజమే కావచ్చు. కానీ మెడిసిన్​ అలా స్కిప్​ కావడం అంత మంచిది కాదు కదా! అందుకే ‘రెడిసిన్​ మెడ్​ సోల్’ కంపెనీ ‘రిమెడ్​ ప్లస్’ అనే​ మంత్లీ పిల్​ ఆర్గనైజర్ బాక్స్​ను తయారుచేసింది. ఆడియో, విజువల్​ ఇండికేషన్​ ద్వారా మెడిసిన్​ రిమైండర్​ నోటిఫికేషన్​ వస్తుంది. ఇది పోర్టబుల్​ ట్రావెల్​ పిల్​ బాక్స్.​ పెద్ద కంపార్ట్​మెంట్స్​ ఉన్న ఈ బాక్స్​లో ఒక నెలకు సరిపడా మందులు పెట్టుకోవచ్చు.

ఒక్కో మెడిసిన్​ ఒక్కో పోర్ట్​లో పెట్టుకునేలా ఐదు పోర్ట్​లు ఉంటాయి. మాయిశ్చర్​ ప్రూఫ్​గా తయారుచేసిన రిమెడ్​ ప్లస్​ బాక్స్​ రెక్టాంగిల్​ షేప్​లో ఉంటుంది. ఇంటరాక్టివ్​ ఇ–పేపర్​ డిస్​ప్లే ఉన్న ఈ బాక్స్​లో ఉండే బ్యాటరీ లైఫ్​ పది రోజులు. మొబైల్​లో రెడిసిన్​(Redicine) యాప్​ వేసుకుంటే ఈ బాక్స్​తో కనెక్ట్​ అయ్యి పనిచేస్తుంది. 

ఎలా పనిచేస్తుందంటే... ఈ డివైజ్​​ను స్టార్ట్​ చేసేందుకు ముందు భాగంలో ఉన్న స్విచ్​ పక్కకి జరపాలి. డివైజ్​​ వైఫైను సింగిల్​ ట్యాప్​తో ఆన్​ చేయొచ్చు. మొబైల్​ను డివైజ్​​కి వైఫై ద్వారా కనెక్ట్​ చేయాలి. తరువాత రెడిసిన్స్​ మొబైల్​ అప్లికేషన్​ను యాప్​ స్టోర్​ నుండి డౌన్​లోడ్​ చేయాలి. డివైజ్​​ను యాప్​లో చెప్పిన సింపుల్​ స్టెప్స్​తో కస్టమైజ్​చేశాక మెడిసిన్​ స్ట్రిప్స్​​ను కంపార్ట్​మెంట్స్​​లో పెట్టాలి. తరువాత మెడిసిన్​ వివరాలను యాడ్​ చేసి రెడిసిన్​ యాప్​లో షెడ్యూల్​ చేస్తే మెడిసిన్​ రిమైండర్​ రెడీ.

ఒకసారి ఇది సెట్​ చేసుకున్నారంటే... వేసుకోవాల్సిన మెడిసిన్​ డోసేజ్​ వివరాలను డిస్​ప్లేలో చూపిస్తుంది. ఆడియో విజువల్​ నోటిఫికేషన్స్​ వస్తుంటాయి. దాంతోపాటు మొబైల్​లో డిటెయిల్డ్​ నోటిఫికేషన్​ వస్తుంది. ఇక మెడిసిన్​ టైం గురించి మర్చిపోయినా పర్వాలేదు. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్​ వస్తుంటాయి. మెడిసిన్​ వేసుకోవాల్సిన టైంకి కంపార్ట్​మెంట్​ నుంచి మెడిసిన్​ తీసుకుని వేసుకోవడమే. అలాగే మెడిసిన్​ వేసుకున్న తరువాత కూడా నోటిఫికేషన్​ వస్తుంది.  మొబైల్​ యాప్​లో మెడిసిన్​ వేసుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు కనపడుతుంటాయి. దీన్ని హై క్వాలిటీ మెడికల్​ గ్రేడ్​ ప్లాస్టిక్​మెటీరియల్​తో తయారుచేశారు. 


ధర: రూ. 4,900


పోర్టబుల్​ మసాజర్​

రకరకాల కారణాల వల్ల చాలామందికి పాదాల నొప్పులు వస్తుంటాయి. పెద్దవాళ్లయితే ఈ నొప్పులతో బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాగని కాళ్లు నొక్కమని ప్రతిరోజూ ఎవరిని అడగాలి? అందుకే ఎవరిమీదా ఆధారపడకుండా నొప్పుల నుంచి బయటపడేసేందుకు మార్కెట్​లోకి వచ్చిందే ఆర్క్​ హీల్ ఫుట్​ మసాజర్​. దీన్ని బీట్​ఎక్స్​పి కంపెనీ తయారుచేసింది. ఈ పోర్టబుల్​ ఫుట్​ మసాజర్​ను ఇంట్లో వాడుకునేందుకు ప్రత్యేకంగా తయారుచేశారు.

పోర్టబుల్​ మసాజర్​ కాబట్టి మీరు ఊరు లేదా టూర్​కి వెళ్తున్నా మీతో పట్టుకు వెళ్లొచ్చు. దీన్ని ఇంట్లో అడాప్టర్​ లేదా కార్​ అడాప్టర్​ పవర్​కి పెట్టుకుని వాడొచ్చు. నీడింగ్, రోలింగ్​ టెక్నాలజీతో ఉన్న ఈ మసాజర్​ వాడకం కూడా సులభమే. కంట్రోల్​ పానెల్‌​తో​ మసాజ్​ ఇంటెన్సిటీని కంట్రోల్​ చేయొచ్చు. అలాగే క్లాక్​వైజ్,​ యాంటీ క్లాక్​వైజ్​ బటన్స్​​తో మసాజ్​ డైరెక్షన్​ సెట్​ చేసుకోవచ్చు. ఇన్​ఫ్రారెడ్​ హీటింగ్​ సిస్టమ్​ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది అంటున్నారు తయారీదారులు. బీట్​ఎక్స్​పి బ్రాండ్​ తెచ్చిన ఈ మసాజర్​ ఆర్క్, ​హీల్​, లెగ్​, ఫుట్​ మసాజ్​ చేస్తుంది. మసాజర్​ బరువు 1.4 కిలోలు. పాదాలకోసం తయారుచేసిన ఈ మసాజర్​ను కాళ్ల పిక్కలు, మెడ, తల వంటి భాగాలకు నొప్పుల నుంచి రిలీఫ్​ కావాలన్నా వాడుకోవచ్చు.

 
ధర: రూ. 2,999