
నవ్వితే.. మనతోపాటే ఈ ప్రపంచం కూడా నవ్వుతుంది! ఏడిస్తే.. మనం ఒక్కరమే ఏడవాల్సి వస్తుంది. నవ్వు ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఎన్నో పాటలు, కవితలతో పాటు స్టడీలూ వచ్చాయి...ఇంకా వస్తున్నాయి.ప్రస్తుతం మనుషుల్లో యాంగ్జెటీ, డిప్రెషన్ పెరిగిపోతోంది. దీంతో ఈ రోజుల్లో పెదాలపై నవ్వు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. కానీ, ఫేక్ నవ్వు తెచ్చుకున్నా చాలు.. అది మన ఎమోషన్స్ ని ప్రభావితం చేస్తుందని 'జర్నల్ ఎక్స్పరిమెంటల్ సైకాలజీ'లో పబ్లిష్ అయిన స్టడీ చెప్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫేక్ నవ్వు పెద్ద రిలీఫ్ ఇస్తుందట..
పెదవులపై చిన్న నవ్వు.. మొత్తం మూడ్ నే మార్చేస్తుంది. ఉదాహరణకు ఎవరిమీదైనా మనకు కోపం ఉందనుకుందాం. కానీ, మనం వాళ్లని క్షమించాలనుకుంటాం. కానీ, క్షమించలేకపోతున్నాం. అలాంటప్పుడు, మనం వాళ్లను క్షమిస్తున్నట్టు ఫీల్ కావడం మొదలు పెట్టాలి. తర్వాత క్షమించగలుగుతాం. అలాగే, మనం సంతోషంగా ఉన్నట్టు యాక్ట్ చేస్తే.. సంతోషంగా ఉంటామట. ఆశ్చర్యంగా ఉంది. కదూ! ట్రై చేసి చూస్తే.. తెలిసిపోతుంది కదా!!
దీని వెనక సైన్స్..
.ఇది చినదానికి చాలా సింపుల్ గా అనిపిస్తున్నా.. దీని వెనక సైన్స్ ఉంది. మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు.. స్ట్రెయిట్ గా కూర్చొని.. బాడీ పోశ్చర్స్ ని, బ్రీతింగ్ ప్యాటర్స్ ను , మజిల్ టెన్షన్స్ ను , ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ను , మాటల్ని మార్చడం వల్ల మూడ్ మారుతుంది.
ALSO READ : వర్షాల వేళ.. గరం గరం పుదీనా రసంతో అన్నం తింటే..
నిటారుగా నిలబడి... భుజాలను వెనక్కి అనుకుంటే కాన్ఫిడెంట్ గా ఫీలవుతాం. మన బాడీని ట్రైన్ చేసినదాన్ని బట్టి.. మన ఆలోచనలు ఉంటాయి. నిటారుగా కూర్చున్నా, నిలబడినా, నడిచినా... సెల్ఫ్ డౌట్, అసంతృప్తి, ఓడిపోతున్నాం లాంటి ఎమోషన్స్ నుంచి బయటపడతాం" అని యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్ స్టడీలో తేలింది.
ఎందుకు వర్కవుట్ అవుతుంది?
ఈ ఫార్ములా ఎందుకు వర్కవుట్ అవుతుంది? అంటే.. దీనికి కారణం మైండ్ బాడీ కనెక్షన్. మనం యాక్ట్ చేస్తే చాలు.. దానికిసంబంధించిన ఎఫెక్ట్స్ ఫాలో అవుతుంటాయి. మన ఆలోచనలపై... బాడీలోని కణాల ప్రభావం ఉంటుంది. దేనిమీదైనా సందేహం కలిగినా.. అసంతృప్తి కలిగినా... ఫీలింగ్స్ డౌన్ అయిపోతాయి. ఆ టైమ్ లో మనం నెగెటివ్ ఫీలింగ్స్ మీద ఫోకస్ పెడితే.. అవి మన బాడీ పోశ్చర్స్ పై ప్రభావం చూపిస్తుంది. బాడీలో వీక్ గా ఉన్నట్టు తెలిసిపోతుంది. ఒకవేళ దాన్ని అర్థం చేసుకొని.. బాడీ పోశ్చర్స్ ని చేంజ్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే నవ్వుకు, సంతోషానికి వర్తిస్తుంది.
నవ్వుతో సంతోషం
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా చేసిన రీసెర్చ్ లో నవ్వు - మైండ్ ను సంతోషం వైపు మళ్లిస్తుందని తేలింది. సింపుల్ గా మన ఫేషియల్ మజిల్స్ మూవ్ చేసిన దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. సాధారణంగా మనం ఫీల్ అయినదాన్ని బట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ రిఫ్లెక్ట్ అవుతుంటాయి. అయితే, నవ్వినప్పుడు మన ఫేస్ మజిల్స్ ఎలా మూవ్ అవుతాయో... దాన్ని బట్టే మూడ్ చేంజ్ అవుతుంది. మన మజిల్ హ్యాపీగా ఉందని చెప్తే... మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పాజిటివ్ కోణంలో చూస్తాం. మనం సంతోషంగా ఉన్నట్టు.. బ్రెయిన్ కు సిగ్నల్స్ అందించగలిగితే.. మెంటల్ హెల్త్ మంచిగా ఉంటుందని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా ప్రొఫెసర్ డా. బ్రయాన్ రాబిన్ సన్ తెలిపారు.