World Cup 2025 Final: వీరోచిత సెంచరీతో సౌతాఫ్రికా కెప్టెన్ ఒంటరి పోరాటం.. ఇండియాను టెన్షన్ పెడుతున్న వోల్వార్డ్

World Cup 2025 Final: వీరోచిత సెంచరీతో సౌతాఫ్రికా కెప్టెన్ ఒంటరి పోరాటం.. ఇండియాను టెన్షన్ పెడుతున్న వోల్వార్డ్

ఇండియాతో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడుతోంది. 299 పరుగుల భారీ ఛేజింగ్ లో సెంచరీ చేసి జట్టు సౌతాఫ్రికా వరల్డ్ కప్ ఆశలను సజీవంగా ఉంచింది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని  డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో 96 బంతుల్లో శతకం బాదిన ఈ సఫారీ కెప్టెన్.. టీమిండియాను టెన్షన్ పెడుతోంది. వోల్వార్డ్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లతో పాటు 1 సిక్సర్ ఉంది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై సెంచరీ చేసిన వోల్వార్డ్.. ఫైనల్లో కూడా శతకం బాది జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది.        

వోల్వార్డ్ సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా ప్రస్తుతం 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. క్రీజ్ లో వోల్వార్డ్(100), చోలే ట్రయాన్(1) ఉన్నారు. సౌతాఫ్రికా విజయానికి 60 బంతుల్లో 88 పరుగులు చేయాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. సెంచరీ చేసి జోరు మీదున్న ఉన్న లారా వోల్వార్డ్ పైనే సౌతాఫ్రికా ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఇండియా సౌతాఫ్రికాను ఎలాగైనా ఒత్తిడిలో నెట్టి విజయం సాధించాలని గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ, షెఫాలీ వర్మ తలో వికెట్లు పడగొట్టారు. శ్రీ చరనికి ఒక వికెట్ దక్కింది.    

►ALSO READ | World Cup 2025 Final: మ్యాచ్ ఇండియా వైపే: వారెవ్వా షెఫాలీ.. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ మ్యాజిక్

అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసి సౌతాఫ్రికాకు ఛాలెంజ్ విసిరింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (87)తో పాటు మిడిల్ ఆర్డర్ లో దీప్తి శర్మ(58) హాఫ్ సెంచరీలు చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాకా మూడు వికెట్లు పడగొట్టింది. ట్రయిన్, నాడిన్ డి క్లెర్క్, నాన్కులులేకో తలో వికెట్ తీసుకున్నారు.