
స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. తక్కువ ధరలో 5G ఆండ్రాయిడ్ 15 ఫోన్ కోసం ఎదురు చూ'స్తున్నారా? తక్కువ ధర, 5G స్మార్ట్ ఫోన్ భారత్ లాంచ్ అయింది. ఇండియన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన లావా ఇప్పుడు షార్క్ 5G పేరుతో సరికొత్త 5G స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. ఇది స్మార్ట్ ఫోన్ విభాగంలో ఓ కుదురు కుదిపేసింది. షార్క్ 5G లాంచింగ్ తో తక్కువ ధరకు 5G స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న రెడ్‌మి, రియల్‌మి, ఇన్ఫినిక్స్ ,పోకో వంటి చైనీస్ సెల్ ఫోన్ కంపెనీలకు లావా గట్టి పోటీ ఇవ్వనుంది.
డిజైన్, స్టోరేజ్ ..
Lava Shark 5G స్మార్ట్ ఫోన్..4GB RAM ,64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఒకే వేరియంట్‌లో లభిస్తుంది. మైక్రో SD ద్వారా స్టోరేజ్ ని 8GB RAM వరకు ఎక్స్ టెండ్ చేసుకోవచ్చు. ఇది నిగనిగలాడే బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని అల్ట్రా-బడ్జెట్ ధరలకు ప్రీమియం లుక్‌ను జోడిస్తుంది. ఈ డివైజ్ దేశం అంతటా లావా ఆన్‌లైన్ ,ఆఫ్‌లైన్ ఛానెళ్ల ద్వారా లభిస్తుంది.
Lava Shark 5G పనితీరు
6nm టెక్నాలజీపై నిర్మించిన Unisoc T765 5G ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ నడుస్తుంది. రోజువారీ పనులకు ,5G కనెక్టివిటీకి మంచి పనితీరును అందిస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది సున్నితమైన విజువల్స్ ,మెరుగైన స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
బ్యాటరీ,ఛార్జింగ్..
ఈ డివైజ్ 5000mAh బ్యాటరీతో USB టైప్-C ద్వారా 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ప్రయాణంలో ఉన్న కస్టమర్లకు రోజంతా ఛార్జింగ్ అందిస్తుంది.
కెమెరాలు ,సాఫ్ట్‌వేర్
Lava Shark 5G తాజా ఆండ్రాయిడ్ 15 OS పై నడుస్తుంది. ఈ స్మార్ట్ఫోన్లో క్యాజువల్ ఫోటోగ్రఫీ కోసం 13MP AI వెనుక కెమెరా, సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఫీచర్లు, సేల్స్, సపోర్టు..
ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్, వాటర్ ప్రూఫ్ నుంచి రక్షిస్తుంది. లావా అదనపు కస్టమర్ సౌలభ్యం కోసం1 సంవత్సరం ఉచిత డోర్ స్టెప్ సర్వీస్‌ను కూడా అందిస్తోంది. తక్కువ ధర , మంచి స్పెసిఫికేషన్లతో లావా షార్క్ 5G భారత్ లో బడ్జెట్ 5G మార్కెట్‌ను కొల్లగొట్టే అవకాశం ఉంది. కాంపిటిటివ్ మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా లావా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుంది.