
అందాల భామ, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘సతీ లీలావతి’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ చిత్రాలను తెరకెక్కించిన తాతినేని సత్య దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగ మోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
లేటెస్ట్గా ‘సతీ లీలావతి’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆద్యంతం ఫన్ రైడ్ గా ఉంది. సోషల్ మీడియాలో వచ్చే కౌంటర్స్, సరదాగా సాగే పంచ్ డైలాగ్స్తో టీజర్ నవ్వులు పూయిస్తోంది. ముచ్చటగా పెళ్లి చేసుకున్న..కొత్త జంట (లావణ్య- దేవ్). నాకెందుకో మనం హ్యాపీగా ఉండలేనప్పుడు.. విడిపోవడమే మంచిదనిపిస్తుంది.. అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది.
►ALSO READ | Cooli: ‘కూలీ’ బడ్జెట్ రూ.350 కోట్లు.. రజనీ, లోకేష్ల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఆ తర్వాత లావణ్య తన భర్తని కట్టేసి.. నువ్ నన్ను కొట్టావా అని భర్త అనగా.. ఏ డౌటా? అని అంటుంది. కేవలం రూ.5లే కదా అని పెన్నుని చీప్ గా చూడకు లీల.. ఆ ఐదు రూపాయల పెన్నుతోనే ఐదు కోట్ల చెక్ మీద సంతకం పెడ్తా.. అని లావణ్య భర్త దేవ్ అనగా.. ' ఏదైనా ఆయిల్ కదా అని.. బెంజ్ కార్లో కోకనట్ ఆయిల్ పోసుకోకూడదు.. ' కౌంటర్లు నాక్కూడా వచ్చంటూ లావణ్య ఇరగదీసింది. దేవ్ మోహన్, లావణ్య మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని.. ఈ సినిమాను ప్రేక్షకులకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి వచ్చిన మట్కా మూవీ భారీ డిజాస్టర్గా నిలిచింది. మరి ఇపుడు లావణ్యకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందోనే ఆసక్తి నెలకొంది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్. త్వరలో 'సతీ లీలావతి' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశముంది.
Step into Leela’s World, Where Love Meets Laughter & Chaos! 🎉#SathiLeelavathi TEASER is OUT NOW 👉 https://t.co/TCLOoTzAbh
— Lavanya konidela tripathi (@Itslavanya) July 29, 2025
The Fun is Just Getting Started – Catch It in Theatres Soon! 🍿@ActorDevMohan @SatyaTatineni @ddp_offl @AnandiArtsOffl @MickeyJMeyer @MeSapthagiri… pic.twitter.com/MAOqPjBAQV