Cooli: ‘కూలీ’ బడ్జెట్ రూ.350 కోట్లు.. రజనీ, లోకేష్ల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Cooli: ‘కూలీ’ బడ్జెట్ రూ.350 కోట్లు.. రజనీ, లోకేష్ల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మూవీ ‘కూలీ’ (Coolie). నాగార్జున నెగిటివ్ రోల్‌‌‌‌లో నటిస్తున్న ఈ చిత్రంలో ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్‌‌‌‌, సౌబిన్ షాహిర్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పూజాహెగ్డే స్పెషల్‌‌‌‌ సాంగ్‌‌‌‌లో మెరిసింది. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

లోకేష్-రజినీ కాంబో సెట్ అయినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. అదే మాదిరిగా వీరిద్దరూ వరుస సినిమాల సక్సెస్ రేట్తో ఉండటం మరో విశేషం. ఈ క్రమంలోనే కూలీ కోసం వీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మరి ఎవరెంత తీసుకున్నారో ఓ లుక్కేద్దాం. 

కూలీ బడ్జెట్ & రెమ్యునరేషన్ వివరాలు:

భారీ అంచనాల మధ్య వస్తున్న కూలీ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించారు. ప్రింట్ మరియు పబ్లిసిటీ ఖర్చుల కోసం దాదాపు రూ.25 కోట్లు పక్కన పెట్టారని టాక్. అంటే.. ఈ లెక్కన కూలీ మొత్తం ఖర్చు రూ.375 కోట్లకు చేరుకుందని సినీ వర్గాల చెబుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. ఈ మూవీ కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ సుమారు రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇది చాలా అత్యధికం అని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు, డైరెక్టర్ లోకేష్ కనగరాజు రూ.50 కోట్ల వరకు కలెక్ట్ చేస్తున్నాడట.

►ALSO READ | HHVM Collection: భారీగా తగ్గిన వీరమల్లు కలెక్షన్లు.. ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ లోకేష్ స్వయంగా కూలీ మూవీ కోసం రూ.50 కోట్లు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.  అంతే కాకుండా తన లాస్ట్ మూవీ లియో బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తన రెమ్యునరేషన్ రెండింతలు పెరిగినట్లు వెల్లడించాడు. లియో మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.600కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇది ఒక దర్శకుడికి ఆల్ టైమ్ రికార్డ్ అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. 

రజినీకాంత్ గత సినిమాల రెమ్యునరేషన్:

"లాల్ సలాం"లో తన పాత్రకు గానూ రజనీకాంత్ రూ.40 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంటే 40 నిమిషాల నిడివి గల తన పాత్రకి  నిమిషానికి రూ.1 కోటి చొప్పున తీసుకున్నాడట. "వేట్టయన్" మూవీకి రూ.125 కోట్లు, జైలర్ మొత్తానికి గానూ రూ.210 కోట్లు సంపాదించారని సమాచారం. (రెమ్యునరేషన్+లాభాల్లో వాటా)

కూలీ ట్రైలర్ అప్డేట్:

కూలీ ట్రైలర్‌‌‌‌‌‌‌‌ ఆగస్టు 2న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో ట్రైలర్‌‌‌‌‌‌‌‌ రిలీజ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. రజినీకాంత్‌‌‌‌, నాగార్జునతో పాటు టీమ్ అంతా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. సన్ పిక్చర్స్‌‌‌‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌‌‌‌ సునీల్ నారంగ్, సురేష్ బాబు, దిల్ రాజు విడుదల చేయబోతున్నారు. ఆగస్టు 14న పాన్‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌గా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీ హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2'తో పోటీ పడనుంది.