HHVM Collection: భారీగా తగ్గిన వీరమల్లు కలెక్షన్లు.. ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

HHVM Collection: భారీగా తగ్గిన వీరమల్లు కలెక్షన్లు.. ఫస్ట్ వీకెండ్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?

హరి హర వీరమల్లు వసూళ్ల పోకడ చూస్తుంటే.. నిర్మాతకి భారీ నష్టాలు మిగిల్చేలా ఉన్నాయి. దాదాపు రూ.250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్లు సాధించలేకపోతుంది.

ఐదు రోజుల్లో వీరమల్లు సినిమా (పెయిడ్ ప్రీమియర్లతో సహా) ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.77.57కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ వసూళ్ళ ప్రకారం, ఇండియాలో రూ.100 కోట్ల నెట్ మార్కును చేరుకోవడానికి ఇంకా చాలా సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ వైడ్గా చూసుకుంటే.. ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటింది. కానీ ఇండియాలో మాత్రం ఆ మైల్ స్టోన్కు చాలా దూరంలోనే ఉంది. ఈ క్రమంలో హరి హర వీరమల్లు వంద కోట్ల నెట్ వసూళ్లు సాధించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు.. వీరమల్లు సోమవారం (జూలై 28) నాడు ఇండియాలో కేవలం రూ.2 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. అంటే, దీన్ని బట్టి వీరమల్లు థియేటర్లలో ఎంత స్లోగా వసూళ్లు చేస్తుందనే విషయం అర్ధమైపోయింది.

ఈ వసూళ్ల తగ్గింపుని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్.. సినిమాలో చాలా సీన్స్ మార్పులు చేసి, పేలవమైన VFX సన్నివేశాలను ఎడిట్ చేసి అప్డేట్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతోంది. ఈ క్రమంలోనే వందకోట్ల మార్క్ అందుకోవడం కష్టమని నిపుణులు అంటున్నారు. 

ట్రేడ్ సంస్థ సక్నిల్క్ ప్రకారం..

ఇండియాలో రోజువారి వసూళ్లు:

ప్రీమియర్స్ రోజు : రూ.12.75 కోట్లు
1వ రోజు (జులై24న): రూ. 34.75 కోట్లు
2వ రోజు: రూ. 8 కోట్లు
3వ రోజు: రూ. 9.15 కోట్లు
4వ రోజు: రూ. 10.6 కోట్లు
5వ రోజు: రూ. 2.32 కోట్లు

మొత్తం: రూ. 77.57 కోట్లు నెట్

వీరమల్లు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకొచ్చినప్పటికీ.. మిక్సెడ్ టాక్ దృష్ట్యా వసూళ్లు సాధించలేకపోతుంది. అయితే, ఈ సినిమా నాని నటించిన 'హిట్ 3' సాధించిన వసూళ్లకు చేరువలో ఉంది. హిట్ 3 మూవీ ఇండియాలో రూ.80.97 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇపుడీ వీరమల్లు ఇండియాలో 5 రోజుల మొత్తానికి గానూ రూ.77.57 కోట్ల నెట్ కలెక్షన్లు చేసింది. మరి లాంగ్ థియేట్రికల్ రన్లో ఎంత వసూళ్లు చేస్తుందో చూడాలి.

ఇకపోతే, ఎంత జెన్యూన్గా కలెక్షన్లు ప్రకటించినా, అవి ఫేక్ అని కామెంట్లు చేస్తారని వీరమల్లు డైరెక్టర్ జ్యోతి కృష్ణ‌ తెలిపారు. ప్రస్తుతం కలెక్షన్లు ఎంతో చెప్పే వెబ్ సైట్లు చాలానే అందుబాటులో ఉన్నాయని తనదైన శైలిలో జ్యోతి కృష్ణ‌ చెప్పుకొచ్చారు.

'హరి హర వీర మల్లు' అనేది ఒక పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్. ఈ సినిమాకి క్రిష్ జాగర్లముడి మరియు AM జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్‌ పోషించగా.. బాబీ డియోల్, నిధి అగర్వాల్ మరియు సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు.

'హరి హర వీర మల్లు' సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేశారు. ఈ సినిమా ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమాలోని కొన్ని భాగాలను చిత్రీకరించామని అన్నారు. ఇక పూర్తిస్థాయిలో సెకండ్ పార్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ పార్ట్ 1తో నష్టాలూ వస్తే.. పార్ట్ 2 తెరకెక్కడం కష్టమే! ఎమవుతుందో చూడాలి.