ఫోన్ వాల్పేపర్ మార్చేసిన లావణ్య.. అంత స్పెషల్ ఏంటో!

ఫోన్ వాల్పేపర్ మార్చేసిన లావణ్య.. అంత స్పెషల్ ఏంటో!

కొణిదెల వంశానికి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో లావణ్య కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేక సందర్భాల్లో దిగిన ఫొటోలు ఉన్నాయి. అయితే ఆ పిక్స్‌లో తనకు కాబోయే భర్త వరుణ్‌ తేజ్‌(Varun Tej) ఫొటోను కూడా పెట్టుకుంది లావణ్య. ఇక ఈ ఫొటోకు "మై లవ్స్‌.. డ్రీమ్‌ బిగ్గర్‌’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట ఫుల్ వైరల్‌ అవుతోంది. దీనికి నెటిజన్స్ కూడా.. లవ్ బర్డ్స్, క్యూట్ కపుల్ అంటూ  తమ స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ జూన్ 9న జరిగిన విషయం తెలిసిందే. గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. తొలిసారి మిస్టర్‌(Mister) సినిమాలో జంటగా కనిపించారు వరుణ్, లావణ్య.