కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది

హైదరాబాద్: సరూర్ నగర్ హత్య ఘటనపై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. నడిరోడ్డుపై నాగరాజు అనే దళిత యువకుణ్ని కొట్టి చంపడం దారుణమన్నారు. తరుణ్ చుగ్ ట్వీట్ కి స్పందిస్తూ.. ట్విట్టర్ ద్వారానే తెలంగాణ పోలీస్ లను యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇవ్వాలంటూ జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ పోలీసులను యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అడగడంపై ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లాకి తరుణ్ ఛుగ్ కృతజ్ఞతలు తెలిపారు. 
సరూర్ నగర్ ఘటన చాలా దుర్మార్గమని, ఇది తెలంగాణ లో దళితుల అధికారాలపై జరుగుతున్న దాడి.. రాజ్యాంగం పై జరుగుతున్న దాడి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ ఘటనపై మౌనంగా ఉందని, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎవరిని సంతోషంగా ఉంచాలనుకుంటోందని ఆయన ప్రశ్నించారు. దోషులు బహిరంగంగా తిరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తరుణ్ చుగ్ ప్రశ్నించారు. 
తెలంగాణలో ఆటవిక రాజ్యం నడుస్తోంది
తెలంగాణ రాష్ట్రంలో అటవిక రాజ్యం నడుస్తోందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని తరుణ్ ఛుగ్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మౌనంగా ఉండటం దేశానికి,  రాజ్యాంగానికి మంచిది కాదన్నారు. సరూర్ నగర్ ఘటన దోషులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళిత బందు పేరుతో దళితులను మోసం చేస్తోందని, తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని,  కొందరు నేతలను కాపాడటానికి  టిఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. సరూర్ నగర్ హత్య ఘటన పై తెలంగాణ ప్రభుత్వం కేవలం కంటి తుడుపు చర్యలు తీసుకుందన్నారు.

దోషులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పంజాబ్ నుంచి తెలంగాణ కు ఆయుధాలు పేలుడు పదార్ధాల సరఫరా ఘటన ఆందోళనకలిగిస్తోందన్నారు. తెలంగాణలో స్లీపర్ సెల్స్ తో కుట్ర జరుగుతుంటే పోలీసులు నిఘా విభాగం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతోందని, తెలంగాణ పోలీసులు టిఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ విమర్శించారు. 

 

ఇవి కూడా చదవండి

కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తుండు

టీఎంసీ పాలనకి ఏడాది పూర్తి.. మరుసటి రోజే మర్డర్స్

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు