ప్రజలను కేసీఆర్ ​తప్పుదోవ పట్టిస్తున్నరు : అరుణ్​ కుమార్

ప్రజలను కేసీఆర్ ​తప్పుదోవ పట్టిస్తున్నరు : అరుణ్​ కుమార్
  • పోలీసులకు న్యాయవాది అరుణ్​ కుమార్ ​ఫిర్యాదు 

పంజాగుట్ట, వెలుగు: ఫోన్ ​ట్యాపింగ్ అంశంపై ప్రజలను మాజీ సీఎం కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని న్యాయవాది అరుణ్​కుమార్ ఆరోపించారు. ఈ కేసుతో మాజీ సీఎం అయిన తనకు ఏం సంబంధమని ఓ చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ అన్నారని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ ​ట్యాపింగ్ వ్యవహారంతో అప్పటి సీఎంకి సంబంధం లేకుంటే ప్రభాకర్​రావు, ప్రణీత్​రావు ద్వారా వచ్చిన సమాచారాన్ని ఎలా వినియోగించుకున్నారని ప్రశ్నించారు. 

సోషల్ ​మీడియాకు కేటీఆర్ లీగల్​ నోటీసులిచ్చారని..తద్వారా సాక్షులను భయపెట్టేందుకే ప్రయత్నించారని తెలిపారు. ఏ తప్పు చేయనప్పుడు లీగల్​ నోటీసులు ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న ప్రభాకర్‌‌ రావు రాష్ట్రానికి వచ్చినా.. రాకున్నా కేసు మాత్రం కేసీఆర్ పీకకు చుట్టుకుంటుందని వెల్లడించారు. సైబర్​ టెర్రరిజానికి పాల్పడిన వారందరికి జీవితకాలపు శిక్ష వేయాలని కోరారు. ఈ కేసులో ఉన్నవారందరినీ అరెస్ట్​ చేయాలని తన పేర్కొన్నారు. కేసీఆర్​తో పాటు జిల్లాల్లో సర్వర్లు పెట్టిన ముఠాపై చర్యలు తీసుకోవాలని అరుణ్ ​కుమార్ తన ఫిర్యాదులో కోరారు.