ఓయూ, వెలుగు: న్యాయవాదుల భద్రత కోసం తెలంగాణలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను తీసుకురావాలని హైకోర్టు న్యాయవాది ఇడుగు రజినీకాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆదివారం న్యాయవాదులు ప్లకార్డులు పట్టుకొని, నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన భద్రతా చట్టాలు లేకపోవడం వల్ల న్యాయవాదులు ప్రాణాలు కోల్పోతుండటం బాధాకరమన్నారు.
రాజస్థాన్‌లో అమలులో ఉన్న అడ్వకేట్ యాక్ట్‌ను తెలంగాణలోనూ అమలుచేయాలని, ట్రైనీ లాయర్లకు నెలకు రూ.5 వేలు స్టైఫండ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు లా స్టూడెంట్లు పాల్గొన్నారు.
