- రాజకీయ లబ్ధి కోసమేమంత్రి పొంగులేటి ఫ్యామిలీపై తప్పుడు ప్రచారం
- న్యాయవాది మాధవరావు
పంజాగుట్ట, వెలుగు: రంగారెడ్డి జిల్లా బాలాపూర్మండలం నాదర్గుల్గ్రామంలోని సర్వే నంబర్ 613లో ఉన్న 373.22 ఎకరాల భూమిపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ప్రముఖ న్యాయవాది మాధవరావు స్పష్టం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి రాజా శివరాజ్బహదూర్వారసులకు చెందిన ప్రైవేట్ పట్టా భూమి అని, దీనిని 2011లో హైకోర్టు, 2015లో సుప్రీంకోర్టు కూడా ధ్రువీకరించాయని తెలిపారు.
ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లను సైతం కోర్టులు కొట్టివేశాయని గుర్తు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు హర్షరెడ్డికి ఈ వ్యవహారంతో ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదని, ఆయన 2021 నుంచి 2023 వరకు మాత్రమే ఏక్యూ స్క్వేర్ రియల్టర్స్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారని వివరించారు. రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి ‘పాట్ ఖరాబ్’ (వ్యవసాయానికి పనికిరానిది) గా నమోదై ఉందని, ప్రస్తుతం ఈ భూమి వారసుల ఆధీనంలోనే ఉందని తెలిపారు. కోర్టు విచారణలో ఉన్న అంశాలను వక్రీకరించి రాజకీయ ప్రయోజనాల కోసం పొంగులేటి కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.
