జడ్జి పదవి చేపట్టకుండా గౌరిని ఆపలేం : సుప్రీంకోర్టు

జడ్జి పదవి చేపట్టకుండా గౌరిని ఆపలేం : సుప్రీంకోర్టు

మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరికి ఊరట లభించింది. జడ్జిగా ఆమె నియామకం సరైందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.మద్రాసు హైకోర్టు అడిషనల్ జడ్జిగా గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. సరైన కారణాలు లేకుండా వేసిన పిటిషన్ను అంగీకరించబోమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ లో లేవనెత్తిన అంశాలేవీ గౌరి అర్హతలకు సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అర్హతలపై అభ్యంతరాలుంటే సవాల్ చేయొచ్చని తేల్చిచెప్పింది.  గౌరిని న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. ఒకవైపు సుప్రీంలో కేసు విచారణ జరగుతుండగానే లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.

గతంలో మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం విచారించే కేసుల్లో గౌరి కేంద్రం తరఫున వాదించారు. దీంతో ఆమెకు బీజేపీతో సంబంధాలున్నాయని, క్రిస్ట్రియన్లు, ముస్లింలపై విద్వేష ప్రసంగాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో మద్రాస్ హైకోర్టు అడిషన్ జడ్జి పదవికి ఆమె పేరు సిఫార్సు చేయడాన్ని  వ్యతిరేకిస్తూ మద్రాస్ బార్ కౌన్సిల్ మెంబర్స్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఒకవైపు సుప్రీంలో కేసు విచారణ జరగుతుండగానే లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.