ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుంది

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుంది
  • OBC మేళాలను ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు


బూత్ వారీగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు బీజేపీ OBCమోర్చా అధ్యక్షులు లక్ష్మణ్. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా  వ్యాక్సినేషన్ పక్రియను జాతీయ పండుగగా నిర్వహించుకోవాలన్నారు. అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని.. బడుగు బలహీన వర్గాలకు బీజేపీ  ప్రభుత్వంలో పెద్దపీట వేసిందన్నారు. ఇన్నేళ్లలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఓబీసీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. 27 శాతం రిజర్వేషన్లు వర్తించేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. OBC మేళాలను ఢిల్లీ సహా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు..ఈ నెల 22న ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాని స్పష్టం చేశారు లక్ష్మణ్. హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని .. అయితే మెజారిటీ అటు ఇటు ఉండవచ్చన్నారు. రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నిక చిన్నది అంటూనే భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ  పార్టీ బలపడుతోందని...టీఆర్ఎస్  పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే నన్నారు.


175 కేంద్ర పథకాలు అమలులో ఉన్నాయని.. వాటిని ప్రజల్లోకి తీస్కెళ్లాని నిర్ణయం తీసుకున్నామని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలిపారు.ప్రతిపక్ష పార్టీలపై విమర్శలను తిప్పి కొట్టాలని అనుకున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో బీజేపీ  కార్యకర్తలు సేవ చేశారని..కరోనా వ్యాక్సినేషన్ ఉచితంగా వేస్తున్నాం.. 100 కోట్ల దగ్గరలో ఉన్నామన్నారు. రైతులు, బీసీలు, దళితులు, యువకులు ,నిరుద్యోగులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్నారు.