
హైదరాబాద్: L B నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇటీవలే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.