హార్ట్​ పేషెంట్ల కోసం యాప్

హార్ట్​ పేషెంట్ల కోసం యాప్

ఫార్మా దిగ్గజం లుపిన్​లో భాగమైన లుపిన్ డిజిటల్ హెల్త్​ (ఎల్​డీహెచ్​) హార్ట్​ పేషెంట్​ల కోసం లైఫ్ పేరిట మొబైల్​ యాప్​ ప్రోగ్రామ్​ను తీసుకొచ్చింది. ట్రీట్​మెంట్ పొందిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరీక్షలు, డాక్టర్లను మళ్లీ కలవాల్సిన సందర్భాలు వంటి వాటిని చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి, అవసరాన్ని బట్టి ఆరు డివైజ్​ల నుంచి కలెక్ట్ చేసే డేటా అంతా వాటికి అనుసంధానమైన లైఫ్ మొబైల్​ యాప్​లో రికార్డ్ అవుతుంది. 

కంపెనీ తరఫు నుంచి ఎన్నికైన హెల్త్​ కోచ్​లు, మిగతా స్టాఫ్ పేషెంట్​కు కావాల్సిన సేవలు అందిస్తారని ఎల్​డీహెచ్​ సీఈవో సిద్ధార్థ్ శ్రీనివాసన్ చెప్పారు. ఈ ప్రోగ్రాం సబ్​స్ర్కిప్షిన్​ నెలకు 500 రూపాయలతో మొదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్​తో పాటు గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా ఇది అందుబాటులో ఉంది.