లీడర్లు పనిచేస్తలేరు.. తిట్టుకునుడే సరిపోతుంది: చినజీయర్ స్వామి

లీడర్లు పనిచేస్తలేరు.. తిట్టుకునుడే సరిపోతుంది: చినజీయర్ స్వామి

ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక సిద్ధాంతం ఉంటుందని.. దానికి అనుకూలంగానే పరిపాలన ఉంటుందని చినజీయర్ స్వామి అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజల రక్షణ కోసమే పరిపాలన సాగిస్తారని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల తర్వాత రాజకీయాలు చేయడం ఆపేసి.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాయని.. కాని ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం కనిపించడం లేదన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రజల సమస్యలపై కాకుండా.. ఒకరిని ఒకరు దూషించుకోవడం పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని చినజీయర్ చెప్పారు. కేవలం ప్రజా సంక్షేమం కోసమే అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమతా స్ఫూర్తి కేంద్రానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చిన్న జీయర్ స్వామి తెలిపారు.