చలో సచివాలయం.. ఉద్రిక్తం

చలో సచివాలయం.. ఉద్రిక్తం

ట్యాంక్ బండ్, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని గాలికొదిలేసిందని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు విమర్శించారు. బుధవారం చలో సచివాలయం చేపట్టగా ఉద్రిక్తతకు దారితీసింది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి స్టూడెంట్​ లీడర్లు ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో సరిగ్గా మౌలిక వసతులు లేవన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​సిప్​ విడుదల చేయకపోవడంతో కాలేజీ విద్యార్థులు పైచదువులకు వెళ్లలేకపోతున్నారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్​ చేశారు.