పార్టీ ఫిరాయింపులో నీదీ.. నాదీ.. ఒకే కథ!

పార్టీ ఫిరాయింపులో నీదీ.. నాదీ.. ఒకే కథ!

ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులను చిత్తు చేయడానికి పోటీ చేసే అభ్యర్థులు ఉపయోగించని ఆయుధం ఉండదు. భాష.. యాస మొదులకునివేషధారణ.. వ్యక్తిత్వం .. వ్యక్తి గత అలవాట్లుఇలా అనేక అంశాలను అస్త్రా లుగా చేసు కునిఉక్కిరి బిక్కిరి చేస్తారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ముందుకుసాగుతారు. ప్రత్యర్థిని ప్రజల్లో నిలదీసి అతనికంటే తామే బెటర్ అని ఒప్పించి గెలుపొందేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు.ఇవన్నీ సహజంగా ఎన్ని కల ప్రచార హోరులోకనిపించే అంశాలు. ప్రస్తుత లోక్ సభ ఎన్ని కలపోరును పరిశీలిస్తే ఓ అంశంపై మాత్రం అభ్యర్థులు విమర్శలు, ప్రతి విమర్శలు చేసు కోవడంలేదు. నీదీ.. నాదీ .. ఒకే కథ అన్న చందంగా సాగి పోతున్నారు. అదే పార్టీ ఫిరాయింపుల గురిం చి.ప్రస్తుతం పోటీలో ఉన్న అన్నీ పార్టీలకు చెందినవ్యక్తుల్లో చాలా మంది ఒక పార్టీ నుంచి మరోపార్టీకి మారినవారే. దీంతో ఎన్నికల్లో అనేకరకాలుగా విమర్శించుకునే అభ్యర్థులు పార్టీఫిరాయింపుల గురించి మాత్రం మాట్లాడటంలేదు. పార్టీ మారని అభ్యర్థి ఎవరైనా పార్టీ మారినప్రత్యర్థిపై విమర్శలు గుప్తిస్తే అతడు తన పార్టీకిచెం దిన వారిపై విమర్శలు గుప్పించే ప్రమాదం లేకపోలేదనే భయంతో ఆ టాపిక్ ని వదిలేశారు.గతంలో పార్టీ మారితే ఎన్నికల ప్రచారంలో అదేఅంశం ప్రధాన, ప్రథమ అస్త్రంగా ఉండేది. పార్టీమారిన వారిని నిలదీసి వారి చిత్తశుద్ధిని ప్రశ్నించి ప్రజల్లో నిలబెట్టి కడిగిపడేసేవారు. ప్రస్తుతం ఆపరిస్థితులు లేవు. చాలా మంది పార్టీ మారిన వారేబరిలోనూ.. బయట ఉన్నారు.