మెటా కీలక నిర్ణయం.. ఇన్ స్టాలో పీజీ టీనేజర్ల 13 కంటెంట్ పై ఆంక్షలు

మెటా కీలక నిర్ణయం.. ఇన్ స్టాలో పీజీ టీనేజర్ల 13 కంటెంట్ పై ఆంక్షలు
  • టీనేజర్లకు ఇన్ స్టాలో కీ ఛేంజెస్..పీజీ13 కంటెంట్​పై పేరెంట్స్​ అనుమతి తప్పనిసరి  
  • ఇన్‌‌స్టాలో టీనేజర్లకు పీజీ 13 కంటెంట్..
  •  సెట్టింగ్‌‌ మార్చాలంటే పేరెంట్స్  అనుమతి తప్పనిసరి చేసిన మెటా

న్యూఢిల్లీ: ప్రముఖ టెక్‌‌ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. తన సోషల్ మీడియా ప్లాట్‌‌ఫాం ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో  టీనేజర్లను ఇకపై పీజీ 13 కంటెంట్( 13 ఏండ్లలోపు వాళ్లు చూసే కంటెంట్, వీడియోలు)కు మాత్రమే పరిమితం చేస్తామని ప్రకటించింది. అంటే టీనేజర్లు ఇక నుంచి తమ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్‌‌లలో సెక్సువల్‌‌ కంటెంట్, గ్రాఫిక్ వైలెన్స్, డిస్టర్బింగ్ ఇమేజెస్, ఆల్కహాల్, డ్రగ్స్ సంబంధిత పోస్టులు, బూతులు, ప్రమాదకరమైన స్టంట్స్ (రిస్కీ బిహేవియర్స్), హానికరమైన థీమ్స్ (సెల్ఫ్-హార్మ్, బాడీ ఇమేజ్ ఇష్యూస్) కంటెంట్ పోస్ట్ చేయలేరు. 

అలాంటి  కంటెంట్ ఉండే ఇతరుల అకౌంట్‌‌లను ఫాలో చేయలేరు. ఇప్పటికే ఫాలో అయితే అందులోని కొత్త పోస్టులను చూడలేరు. పోస్టుల కింద  డైరెక్ట్ మెసేజెస్, కామెంట్స్ పెట్టలేరు. అలాగే ఉన్న కామెంట్స్ కూడా చూడలేరు. ఇంటరాక్ట్ మొత్తం బ్లాక్ అవుతుంది. 18 ఏండ్ల కంటే తక్కువ వయసున్న వారి కొత్త, పాత ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్‌‌లు అన్ని ఆటోమేటిక్‌‌గా "13+ సెట్టింగ్"లోకి మారిపోతాయి. 

ఈ సెట్టింగ్‌‌లో టీనేజర్లు చూసే కంటెంట్ పీజీ-13 మూవీల్లా ఉంటాయి. అంటే సాధారణ భాష, మితమైన హింస ఉంటాయి.  సెక్సువల్‌‌ కంటెంట్, డ్రగ్స్,  రిస్కీ బిహేవియర్స్ అస్సలు కనిపించవు. టీనేజర్లు ఈ సెట్టింగ్‌‌ను మార్చాలంటే వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సిందేనని మెటా స్పష్టం చేసింది.