మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు శుభవార్త

మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు శుభవార్త

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ఉద్యోగుల జీతాలను దాదాపు డబుల్ చేస్తామని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల చెప్పారు. తమ వినియోగదారులు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందించడంలో మైక్రోసాఫ్ట్ ఎంప్లాయిస్ అద్భుత పనితీరు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సంస్థ ఉద్యోగులకు అధిక డిమాండ్ ఉండటంతో గ్లోబల్ మెరిట్ ను డబుల్ చేస్తున్నామన్నారు. ఈ పెంపు స్థానిక డేటా ఆధారంగా వివిధ దేశాల్లో ఒక్కోరకంగా ఉంటుందని వివరించారు. 

సిబ్బందికి స్టాక్స్ రూపంలో ఇచ్చే సౌలభ్యాలు పెరగనున్నాయి. ఇటీవల కాలంలో సంస్థలో చేరినవారు, కెరీర్ మధ్యలో ఉన్నవాళ్లు వేతనాల్లో ఈ పెరుగుదల కనిపించనుంది. తమ టాలెంట్ బయటకు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు పలు సంస్థలు ఇదే తరహా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఫిబ్రవరిలో టెక్ ఉద్యోగుల మూల వేతనాన్ని అమెజాన్ సంస్థ దాదాపు రెట్టింపు చేసింది. జనవరిలో గూగుల్ తన నలుగురు టాప్ ఎగ్జిక్యూటివ్స్ జీతాలను భారీగా పెంచింది. వారి మూల వేతనం 6,50,000 డాలర్ల నుంచి ఒక మిలియన్ డాలర్లకు పెరిగింది. 

కరోనా కాలంలో ఉద్యోగులు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ, అధిక వేతనాలు ఇచ్చే సంస్థల వైపు దృష్టిసారిస్తున్నారు. కరోనా సమయంలో ఆఫీసులకు వెళ్లడం కంటే ఇంటి నుంచి ఉద్యోగం చేయడానికే చాలా మంది మొగ్గుచూపుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం.. 

ప్రజాదర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

రెండు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన