న్యూఢిల్లీ: ఇండియా విమెన్స్ బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ఒలింపియన్ జెన్నిఫర్ పేస్ (72) కన్నుమూశారు. టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ తల్లి అయిన జెన్నిఫర్, గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచింది. కోల్‌కతాలోని సెయింట్ థామస్ చర్చిలో సోమవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి.
జెన్నిఫర్ పేస్ ప్రముఖ బెంగాలీ కవి, నాటకకర్త మైఖేల్ మధుసూదన్ దత్ మునిమనుమరాలి కుమార్తె. ఆమె 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో ఇండియా బాస్కెట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించింది. జెన్నిఫర్ భర్త, మాజీ హాకీ స్టార్ డాక్టర్ వెస్ పేస్.1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన ఇండియా హాకీ జట్టులో సభ్యుడు.
