ఆకుకూర చట్నీ.. సూపర్ టేస్ట్.. హెల్దీ ఫుడ్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. ఎలా తయారు చేయాలంటే

ఆకుకూర చట్నీ..  సూపర్ టేస్ట్.. హెల్దీ ఫుడ్..  ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. ఎలా తయారు చేయాలంటే

అన్నం తినేటప్పుడు ఎన్ని కూరలున్నా... ఏదైనా చట్నీ... అదే రోటి పచ్చడి మిక్సీ పచ్చడి.. ఉంటే ఆ మజానే వేరు. అయితే... మిగతా వాటికంటే మేమే మేలు. మాలో ఉన్నన్ని పోషకాలు, మాతో వచ్చే టేస్ట్ వేరే దేనికీ లేవు' అంటున్నాయి ఆకుకూర చట్నీలు. మరి భోజనంలో రోజుకో చట్నీని చేర్చుకోండి. రుచికి రుచికి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరింకెందుకు ఆలస్యం... వెంటనే రకరకాల ఆకుకూర చట్నీలను చేసుకుని లాగించేయండి. కొన్ని రకాల ఆకు కూరల చట్నీలను ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. . 

పుదీనా పచ్చడి తయారీకి కావలసినవి

  •  పుదీనా ఆకులు - అర కప్పు
  •  మినప్పప్పు 1 టీ స్పూన్
  •  శెనగవ ప్పు-1 టీ స్పూన్ 
  • పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూన్
  •  చింతపండు గుజ్జు -సిటీ స్పూన్
  •  ఉప్పు- తగినంత
  •  నూనె సరిపడా
  •  పసుపు-చిటికెడు 
  • జీలకర్ర- అర టీ స్పూన్
  •  ఆవాలు - అర టీ స్పూన్
  •  ఎండు మిర్చి ముక్కలు - 1 టీస్పూన్
  •  కరి వేపాకు అమ్మ- 1
  •  పల్లీలు- పావు కప్పు

తయారీ విధానం: పుదీనా ఆకులను నూనెలో, పల్లీలను విడిగా వేగించి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్​ పై పాన్​ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక మళ్లీ నూనె పోసి శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు వేసి వేగించాలి. తర్వాత మిక్సీ గిన్నెలో పప్పుల మిశ్రమాన్ని పల్లీలు, పుదీనా ఆకులు, చింతపండు గుజ్జు, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. చివరిగా జీలకర్ర ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి.

కరివేపాకు  పచ్చడి తయారీకి కావలసినవి

  •  కరివేపాకు రెమ్మలు- 5
  •  పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు
  •  మినప్పప్పు ఒక టీ స్పూన్
  •  శనగపప్పు - ఒక టీ స్పూన్
  •  పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూన్
  •  అల్లం తరుగు - అర టీ స్పూన్
  •  చింతపండు గుజ్జు-ఒక టీస్పూన్
  •  ఉప్పు- తగినంత
  •  నూనె - సరిపడా
  • ఇంగువ - చిటికెడు
  •  పసుపు-చిటికెడు
  •  జీలకర్ర- అర టీ స్పూన్
  •  ఆవాలు - అరస్పూన్
  •  ఎండు మిర్చి ముక్కలు - ఒక టీస్పూన్

తయారీ విధానం : ముందుగా స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేదెక్కాక శెనగ పప్పు, మిన ప్పప్పు, పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేసి వేగించాలి. వాటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. అందులోనే చింతపండు గుజ్జు, కొబ్బరి తురుము, అల్లం తరుగు, ఉప్పు, సరిపడా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి. తర్వాత స్టవ్​పై పాన్​ పెట్టి నూనె పోయాలి.  అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేయాలి. తర్వాత అందులో పసుపు, ఇంగువ కూడా వేయాలి. ఆ పోవును కరివేపాకు మిశ్రమంలో వేసి కలపాలి. పూర్తిగా పచ్చిమిర్చితోనే కాకుండా  ఎండుమిర్చితోనూ చట్నీ చేసుకోవచ్చు

కొత్తిమీర పచ్చడి తయారీకి కావలసినవి

  •  కొత్తిమీర తరుగు - 2 కప్పులు
  • అల్లం తరుగు - అర టీ స్పూన్
  •  పచ్చిమిర్చి తరుగు -ఒక టిన్నర టీస్పూన్
  •  వెల్లుల్లి రెబ్బలు -5
  •  చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం - 1 టీ స్పూన్ 
  • జీలకర్ర పొడి- అర టీ స్పూన్
  •  ఉప్పు- తగినంత
  •  పసుపు -చిటికెడు 
  • పచ్చి కొబ్బరి తురుము- పావు కప్పు
  •  ఎండు మిర్చి ముక్కలు - 1 టీ స్పూన్
  •  జీలకర్ర-అర టీ స్పూన్
  •  ఆవాలు - అరటీ స్పూన్ 
  • నూనె-‌‌సరిపడ

తయారీ విధానం: ముందుగా అల్లం తరుగు, వెల్లులి రెబ్బలు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ఉప్పు, చింతపండు గుజ్జు లేదా నిమ్మరసం వచ్చి కొబ్బరి తురుము, సరిపడా నీళ్లు... అన్నింటినీ కలిపి మిక్సీ లేదా గ్రైండర్​ లో  రుబ్బాలి. అందులోనే కొత్తి మీర తరుగు వేయాలి. ఇప్పుడు స్టవ్​ పై పాన్​  పెట్టి  నూనె పోయాలి. అది వేడెక్కాక జీలకర్ర వేయాలి. ఆపైన ఎండుమిర్చి ముక్కలు, పసుపు, కరివేపాకు వేసి కలపాలి. చివరగా పోవును కో త్తిమీర మిశ్రమంలో వేసి కలపాలి..

పాలకూర పచ్చడి తయారీకి కావలసినవి

  •  పాలకూర ఆకులు-1 కప్పు 
  • చింతపండు పులుసు సరిపడా
  • పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూన్
  •  పచ్చికొబ్బరి తురుము -పావు కప్పు
  •  ఉల్లిగడ్డ ముక్కలు- పావు కప్పు
  •  ఉప్పు- తగినంత
  •  జీలకర పావు టీ స్పూన్
  •  ఆవాలు- పావు టీ స్పూన్
  •  కరివేపాకు రెమ్మ- 1
  •  ఎండు మిర్చి ముక్కలు -1 టీ స్పూన్ 
  • నూనె - సరిపడా
  •  పసుపు- చిటికెడు
  •  మినప్పప్పు- అర టీస్పూన్

తయారీ విధానం : ముందుగా పచ్చిమిర్చి తరుగు (కావాలంటే వీటిని నూనెలో వేగించుకోవచ్చు) పచ్చి కొబ్బరి తురుమును మిక్సీలో గ్రైండ్ చేయాలి. తర్వాత పాలకూర ఆకులను నూనెలో వేగించి... చింతపండు పులుసు, ఉప్పుతో కలిపి మిక్సీ లేదా రోట్లో రుబ్బాలి. ఇప్పుడు స్టవ్​ పై  పాన్​ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేయాలి. అది వేగాక ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు. పసుపు, మినప్పప్పు వేయాలి. అవన్ని కూడా వేగాక పాలకూరలో వేసి కలపాలి


మునగాకు పచ్చడి తయారీకి కావలసినవి 

  • మునగాకు 1 కప్పు
  •  చింతపండు పులుసు - సరిపడా
  •  పచ్చిమిర్చి -4
  •  వెల్లుల్లి రెబ్బలు - 5
  •  ఉల్లిగడ్డ ముక్కలు పావు కప్పు 
  • ఉప్పు- తగినంత
  •  జీలకర్ర-పావు టీ స్పూన్
  •  ఆవాలు-పావు టీ స్పూన్
  •  కరివేపాకు రెమ్మ- 1
  •  ఎండు మిర్చి ముక్కలు - 1 టీ స్పూన్
  •  నూనె - సరిపడా
  •  పసుపు - చిటికెడు
  • మినప్పప్పు - అర టీ స్పూన్

తయారీ విధానం : ముందుగా మునగాకును నూనెలో వేగించి పక్కన పెట్టాలి. ఆపైన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను కూడా నూనెలో వేగించాలి. . ఇప్పుడు మునగాకు. పచ్చిమిర్చి, వెల్లుల్లి, చింతపండు పులుసు, ఉప్పు అన్నింటినీ కలిపి మిక్సీ లేదా రోట్లో రుబ్బాలి. తర్వాత స్టవ్ పై  పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కాక జీలకర్ర ఆవాలు వేయాలి. ఇప్పుడు అందులో ఉల్లిగడ్డ ముక్కలు, పసుపు, మినప్పప్పు, ఎండు మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ఆ పోవును, రుబ్బుకున్న మునగాకు ముద్దలో వేసి కలపాలి.