పుట్టిన బిడ్డకు సూర్యకిరణాలే ఆహారం..ఆ తర్వాత ఏం జరిగింది

పుట్టిన బిడ్డకు సూర్యకిరణాలే ఆహారం..ఆ తర్వాత ఏం జరిగింది

రష్యాలో వింత ఘటన చోటు చేసుకుంది. నెల రోజుల మగ బిడ్డను తల్లిదండ్రులు  అనాగరిక వైఖరి కారణంగా చంపుకున్నారు. నెల రోజుల బిడ్డకు తిండి, పానీయం ఇవ్వకుండా సూర్యకిరణాలు మాత్రమే ఆహారంగా ఇవ్వడంతో  అనారోగ్యంతో మగబిడ్డ మరణించాడు. దీంతో పేరెంట్స్​పై పోలీసులు క్రిమినల్​ కేసు నమోదు చేశారు. చనిపోయిన శిశువు తల్లిదండ్రులు చెప్పిన వింత సమాధానాలకు పోలీసులు తలలు పట్టుకున్నారు. 

పేరంట్స్​ మూర్ఖత్వంతో నెల రోజుల బిడ్డ మృతి

రష్యాలోని సోచి నగరంలో న పిల్లల మరణాల గురించి జ్వెజ్డా న్యూస్ నివేదికలో, ఈ పిల్లవాడు తీవ్రమైన అలసట,ఆకలితో మరణించాడని పేర్కొన్నారు. తల్లి మిరోనోవాకు  ఇంట్లోనే 2 నెలల పాటు కళ్ళు మూసుకోవాలని పోలీసులు ఆదేశించారు. నెల రోజుల శిశువుకు ఇచ్చిన ఆహారంపై నివేదికలో తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాడికల్ ముడి ఆహార నిపుణులుగా, మిరోనోవా,లూటీ "ది లివింగ్ మ్యాన్" అనే క్లబ్‌ను నడుపుతున్నారు.  నిర్లక్ష్యం కారణంగా  సొంత బిడ్డను చంపినందుకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

వారి బిడ్డకు సూర్యకాంతే ఆహారం

రష్యాలో నెల రోజుల పాప తిండి విషయంలో తల్లిదండ్రులు అనాగరిక వైఖరిని ప్రదర్శించారు. వింత ఆహారం ఇవ్వడంతో తల్లిదండ్రులే ఆ పిల్లవాడిని చంపుకున్నారు.  మాగ్జిమ్​ లూటీ, ఆక్సానా మిరోనోవా  దంపతులకు  నెల రోజుల కితం మగ బిడ్డ జన్మించింది.  అయితే వారు ఆ బిడ్డకు తిండి, పాలు పెట్టకుండా కేవలం సూర్యకాంతిని మాత్రమే ఆహారంగా ఇచ్చారు, దీంతో ఆ బిడ్డ ఆకలికి తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలసట మొదలై చివరకు న్యుమోనియా బారిన పడ్డాడు.  ఆ తరువాత ఆకలి, దాహంతో నెల రోజుల బిడ్డ మరణించాడు.  తల్లి దండ్రుల మూర్ఖత్వం కారణంగా బిడ్డను కోల్పోయారు.