ఎదురులేని కేటీ లెడెకీ .. ఏడో గోల్డ్‌‌‌‌ మెడల్ తో రికార్డు

 ఎదురులేని కేటీ లెడెకీ .. ఏడో గోల్డ్‌‌‌‌ మెడల్ తో రికార్డు


సింగపూర్‌‌‌‌: వరల్డ్‌‌‌‌ స్విమ్మింగ్‌‌‌‌ చాంపియనషిప్స్‌‌‌‌లో  అమెరికా లెజెండరీ స్విమ్మర్ కేటీ లెడెకీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. విమెన్స్ 800 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌‌‌‌లో  గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.  ఈ పోటీలో ఆమెకు ఇది వరుసగా ఏడో వరల్డ్ చాంపియన్‌‌‌‌షిప్ మెడల్ కావడం గమనార్హం. దాంతో ఒకే విభాగంలో అత్యధికసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌గా నిలిచిన స్విమ్మర్‌‌‌‌గా చరిత్ర సృష్టించింది.

 శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్లో  లెడెకీ  8 నిమిషాల 05.62 సెకండ్ల టైమింగ్‌‌‌‌తో టాప్ ప్లేస్‌‌‌‌లో అగ్రస్థానంలో నిలిచింది.  ఆస్ట్రేలియాకు చెందిన లానీ పలిస్టర్‌‌‌‌ (8:05.98సె) సిల్వర్‌‌‌‌‌‌‌‌ నెగ్గగా,  700 మీటర్ల వరకూ టాప్‌‌‌‌లో నిలిచి చివర్లో తడబడ్డ కెనడా టీనేజర్  మెకింతోష్‌‌‌‌ (8:07.20 సె) కాంస్యం అందుకుంది. కాగా, 4x100 మీటర్ల మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ రిలేలో అమెరికా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఫైనల్లో 3 నిమిషాల 18.48 సెకండ్లతో పోడియం ఫినిష్ చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.  ఈ క్రమంలో 2023లో ఆస్ట్రేలియా నెలకొల్పిన 3 నిమిషాల 18.83 సెకండ్ల రికార్డును బ్రేక్ చేసింది.