ఇండియా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి జైదేవ్‌‌‌‌‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌

ఇండియా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి జైదేవ్‌‌‌‌‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌

చట్టోగ్రామ్‌‌‌‌‌‌‌‌: లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ పేసర్‌‌‌‌‌‌‌‌ జైదేవ్‌‌‌‌‌‌‌‌ ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌ 12 ఏండ్ల గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇండియా టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు.  2010లో సౌతాఫ్రికాపై ఏకైక టెస్టు ఆడిన అతడిని  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం సెలెక్షన్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చింది. ఇండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌తో ఈ నెల 14న మొదలయ్యే తొలి టెస్టుకు దూరం  అయ్యాడు. అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అభిమన్యూ ఈశ్వరన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చాడు.

రెండో వన్డేలో బొటన వేలికి గాయం అవ్వడంతో రోహిత్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే ఇండియా తిరిగొచ్చాడు. ముంబైలో స్పెషలిస్ట్‌‌‌‌‌‌‌‌లను కలిశాడని, రెస్ట్‌‌‌‌‌‌‌‌ తీసుకోవాలని సూచించడంతో తొలి టెస్టుకు దూరంగా ఉంటున్నాడని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. రెండో టెస్టుకు అందుబాటులో ఉండే విషయంపై మెడికల్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ సూచన మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. మరోవైపు గాయాలతో ఇబ్బంది పడుతున్న షమీ, జడేజా స్థానాల్లో నవదీప్‌‌‌‌‌‌‌‌ సైనీ, యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ సౌరభ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంది. అదనంగా ఉనాద్కట్‌‌‌‌‌‌‌‌ ను కూడా టీమ్‌‌‌‌‌‌‌‌లో చేర్చింది.