సివిల్స్ పరీక్షల కోసం కార్పోరేట్ ఉద్యగాన్ని వదిలేసా : వార్దా ఖాన్

సివిల్స్ పరీక్షల కోసం కార్పోరేట్ ఉద్యగాన్ని వదిలేసా :  వార్దా ఖాన్

కార్పెరేట్ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యానని యూపీఎస్సీలో ఆల్ ఇండియా 18వ ర్యాంక్ సాధించిన వార్దా ఖాన్ తెలిపారు.  ప్రపంచ‌వ్యాప్తంగా దేశాన్ని ఉన్నత స్థానంలో నిల‌పాల‌న్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలిపారు.  త‌న క‌ల నెర‌వేరిన‌ట్లు ఫీల‌వుతున్నానని త‌న కుటుంబంలో అంద‌రూ సంతోషంగా ఉన్నార‌ని, చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నారని తెలిపారు ఖాన్. 

ఒక విద్యార్థి త‌ర‌హాలోనే త‌న జ‌ర్నీ స్టార్ట్ అయ్యింద‌ని, సివిల్స్ ర్యాంక్ కొట్టాల‌vaన్న త‌ప‌న ఉండేద‌ని, కానీ 20 లోపే ర్యాంక్ వ‌స్తుంద‌న్న అనుకోలేద‌ని ఆమె అన్నారు. తన తొమ్మిదేండ్ల వయసులోనే తండ్రిని కోల్పోవాల్సి వచ్చిందని అప్పటినుంచి తన అమ్మ ఎంతో కష్టపడి పెంచిందని తెలిపారు. కార్పొరేట్ ఉద్యోగాన్ని వ‌దిలివేసి సివిల్స్ ప్రిప‌రేష‌న్‌పై టార్గెట్ పెట్టిన‌ట్లు తెలిపారు ఖాన్. 

ఇంటి వ‌ద్దే ప్రిపేర‌య్యాన‌ని, ఓ ప్రైవేటు సంస్థ నుంచి ఏడాది పాటు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకున్నట్లు ఆమె చెప్పారు.  2023 యూపీఎస్సీలో ఆదిత్య శ్రీవాత్సవ్ టాప్ రాగా, పాల‌మూరు బిడ్డ అన‌న్య రెడ్డి మూడ‌వ ర్యాంక్ సాధించిన విష‌యం తెలిసిందే.