కామ్రేడ్ల చూపు కాంగ్రెస్ వైపు?.. కలిసే పోటీ చేయనున్న సీపీఐ, సీపీఎం

కామ్రేడ్ల చూపు కాంగ్రెస్ వైపు?.. కలిసే పోటీ చేయనున్న సీపీఐ, సీపీఎం
  •  ముగ్ధం భవన్ లో ఇరు పార్టీల నేతల భేటీ
  • బీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు పై చర్చ
  • రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

హైదరాబాద్: బీఆర్ఎస్ తో పొత్తుల కోసం ప్రయత్నించిన కామ్రేడ్ల చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపునకు మళ్లింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు హస్తం పార్టీతో జతకట్టాలనిచూస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ అదే పాలసీని అవలంబించనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఎంబీ భవన్ లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గం భేటీ అయ్యింది. పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,నేతలు వీరయ్య, నాగయ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

 ఈ సమాశానికి పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, బీవీ రాఘవులు హాజరైనట్టు సమాచారం. అసెంబ్లీ, పార్ల మెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. మరో వైపు ముగ్ధం భవన్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకటరెడ్డి భేటీ అయ్యారు. రెండు పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చాయి. కాంగ్రెస్ తో జతకట్టడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదనే అభిప్రాయాన్ని రెండుపార్టీల నేతలూ వ్యక్తం చేసినట్టు సమాచారం.