ఇవాళ ఏదో ఒకటి తేల్చండి.. కాంగ్రెస్కు వామపక్షాల డెడ్ లైన్

 ఇవాళ ఏదో ఒకటి  తేల్చండి..  కాంగ్రెస్కు వామపక్షాల డెడ్ లైన్

కాంగ్రెస్ తో పొత్తుల విషయం ఇంకా తేలకపోవటంతో వామపక్షాలు ఇవాళ(నవంబర్ 2న) కీలక నిర్ణయం ప్రకటించే చాన్స్ ఉంది. స్థానాల కేటాయింపుపై మధ్యాహ్నం 3 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ కు లెప్ట్ పార్టీలు డెడ్ లైన్ పెట్టాయి. లేదంటే సీపీఎం పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తామని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. అటు పొత్తలు విషయమై ఇవాళ క్లారిటీ ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తమకు ఫోన్ చేసి చెప్పినట్లు తమ్మినేని అన్నారు. నవంబర్ 1న  జరిగిన స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ఏలాంటి నిర్ణయాలు తీసుకోలుదరి భట్టి చెప్పారని తమ్మినేని తెలిపారు. 

నవంబర్ 1న  జరిగిన సీపీఎం కార్యవర్గ సమావేశాల్లో కాంగ్రెస్ తో పొత్తల విషయమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. వైరా, మిర్యాలగూడ స్థానాలు కేటాయిస్తే పొత్తుకు సమ్మతించాలని భావిస్తున్న సీపీఎం.. లేనిపక్షంలో తమ దారి తాము చూసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తో సీపీఐకి పొత్తు కుదిరితే తాము ఒంటరిగానే పోటిచేస్తామని సీపీఎం నేతలు చెబుతున్నారు. సీపీఐ అభ్యర్థులు పోటీచేసే చోట సీపీఎం పోటీ చేయదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అటు కాంగ్రెస్  ఫైనల్ లిస్ట్ ప్రకటించే వరకూ వేచి చూస్తామని, ఆ తరువాతే తమ నిర్ణయం ఉంటుందన్నారు సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు.