
శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ తన టెస్ట్ కెరీర్ లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. మంగళవారం (జూన్ 17) గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ టెస్ట్ మాథ్యూస్ టెస్ట్ కెరీర్ లో చివరిది. గత నెలలో ఈ లంక ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ తో జరగబోయే చివరి టెస్ట్ తన కెరీర్ లో చివరిదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫేర్ వెల్ టెస్టుకు మాథ్యూస్ కు అరుదైన గౌరవం లభించింది. ఇరు జట్ల ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ తో సత్కరించారు. సహచర క్రికెటర్లతో తన చివరి మ్యాచ్ కు ముందు ఈ దిగ్గజ ఆల్ రౌండర్ సంతోషంగా గడిపాడు.
శ్రీలంక జట్టు తరపున 2009లో గాలె వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్‌తో అరంగేట్రం చేసిన మాథ్యూస్.. 16 ఏళ్ళ పాటు లంక టెస్ట్ జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ జట్టు స్టార్ బ్యాటర్లలో ఒకడిగా ఎదిగాడు. సాలిడ్ డిఫెన్స్, స్టైలిష్ షాట్లతో అభిమానుల మనసులు దోచుకున్నాడు. మహేల జయవర్దనే, కుమార సంగక్కర,దినేష్ చండిమాల్‌తో కలసి సమర్థంగా జట్టును నడిపించాడు. గాయాల కారణంగా పూర్తిస్థాయిలో తన ప్రభావం చూపించకపోయినా వందకు పైగా టెస్టులు ఆడాడు. మొత్తంగా 118 టెస్టుల్లో 44.62 సగటుతో 8,167 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
టెస్టు క్రికెట్లో శ్రీలంక తరపున కుమార్ సంగక్కర, మహేలా జయవర్ధనే తర్వాత అత్యధిక రన్స్ చేసిన మూడో ప్లేయర్ మాథ్యూస్.అలాగే, 2013 నుంచి 2017 వరకు మూడు ఫార్మాట్లలో శ్రీలంకకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 34 మ్యాచ్ ల్లో శ్రీలంక జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. చివరిసారిగా లంక తరపున 2024 టీ20 వరల్డ్ కప్ ఆడాడు. ప్రస్తుతం గాలే వేదికగా జరుగుతున్న టెస్ట్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. ప్రస్తుతం 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 55 పరుగులకు చేసింది
A guard of honour for Angelo Mathews as he is playing his last and final Test against Bangladesh in Galle 👏#AngeloMathews #SLvBAN #SriLanka #TestCricket #CricketTwitter pic.twitter.com/PNKBvvh1pb
— InsideSport (@InsideSportIND) June 17, 2025