ఆటలు, ఆరోగ్యం రెండూ ముఖ్యమే : మహేంద్రసింగ్ ధోనీ

ఆటలు, ఆరోగ్యం రెండూ ముఖ్యమే : మహేంద్రసింగ్ ధోనీ

హైదరాబాద్, వెలుగు :  ఆటలు, ఆరోగ్యం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన విషయాలని దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. ప్రజలు ఆటలతో పాటు ఆరోగ్యకరమైన జీవనానికి 
ప్రాధాన్యత ఇవ్వాలన్నాడు. సిటీ కేంద్రంగా  పనిచేస్తున్న మ్యాక్సివిజన్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్​కు లెజెండరీ క్రికెటర్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా ఎంపికయ్యాడు.

ఈ విషయాన్ని సోమవారం మ్యాక్సివిజన్ యాజమాన్యం ప్రకటించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ధోనీ ఆటల్లో విజయం సాధించేందుకు స్పష్టమైన విజన్ కీలకం అన్నాడు.  కంటిచూపు క్రీడలతో ఆరోగ్యకరమైన జీవితానికి ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు.