హైదరాబాద్, వెలుగు: భారత్‌లో విస్తరిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) కోసం లెనోవో సంస్థ సరికొత్త ఫుల్ స్టాక్ సొల్యూషన్స్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని 1,600కిపైగా జీసీసీలకు ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలు, హైబ్రిడ్ క్లౌడ్ సేవలు అందించడం దీని ఉద్దేశం. కంపెనీల కార్యకలాపాలను ఆధునీకరించడంతో పాటు ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి లెనోవో టెక్నికల్సపోర్ట్ ఇస్తుంది.
బెంగళూరులోని తన పరిశోధన ల్యాబ్ ద్వారా వినూత్న డిజైన్లను అందుబాటులోకి తెస్తోంది. భద్రతకు పెద్దపీట వేస్తూ, తక్కువ విద్యుత్ వినియోగించే ఏఐ పరికరాలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రపంచ స్థాయి తయారీ అనుభవంతో భారత్‌లోని జీసీసీల వృద్ధిలో భాగస్వామి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని లెనోవో ప్రకటించింది.
