ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 100 కోట్ల పెట్టుబడి

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ. 100 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ: కళ్లద్దాల రిటైల్ సంస్థ లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ సొల్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐపీఓకు ముందు జరిగే రౌండ్​లో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ మ్యూచువల్ ఫండ్ రూ. 100 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ లావాదేవీ కోసం కంపెనీ ఫౌండర్లలో ఒకరైన నేహా బన్సాల్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఆల్టర్నేటివ్​ఇన్వెస్ట్​మెంట్​మెంట్​ఫండ్​కు ఒక్కో దానికి రూ. 402 చొప్పున 24.87 లక్షల ఈక్విటీ వాటాలను బదిలీ చేశారు. ఈ లావాదేవీ తరువాత ఆమె వాటా 7.61 శాతం నుంచి 7.46 శాతానికి తగ్గింది. గత వారం, అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్) వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కూడా రూ. 90 కోట్లు పెట్టుబడి పెట్టారు. లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ రూ. 7,278 కోట్ల ఐపీఓ శుక్రవారం ప్రారంభం కానుంది. ప్రైస్​బ్యాండ్​ను రూ. 382 నుంచి రూ. 402గా నిర్ణయించారు. దీని ద్వారా వచ్చే నిధులను కొత్త కంపెనీ స్టోర్ల ఏర్పాటు, టెక్నాలజీ, బ్రాండ్ ప్రచారం వంటి వ్యూహాత్మక కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు.