శ్రీశైలం పాతాళగంగ దగ్గర చిరుత మృతి

శ్రీశైలం పాతాళగంగ దగ్గర చిరుత మృతి

శ్రీశైలం పాతాళగంగ సమీపంలో చిరుత పులి మృతిచెందిన ఘటన బుధవారం(అక్టోబర్​15) వెలుగుచూసింది. స్థానికులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

ఇటీవల ఔటర్ రింగ్ రోడ్, పాతాళగంగ మెట్ల వద్ద రాత్రివేళ భక్తులకు తారసపడిన చిరుతే మృతి చెందినట్లు తెలుస్తోంది. కుక్కల కోసం ఇళ్ల మధ్య కూడా సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

►ALSO READ | నామినేషన్ దాఖలు చేసిన BRS అభ్యర్థిని మాగంటి సునీత