నామినేషన్ దాఖలు చేసిన BRS అభ్యర్థిని మాగంటి సునీత

నామినేషన్ దాఖలు చేసిన BRS అభ్యర్థిని మాగంటి సునీత

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే బుధవారం (అక్టోబర్ 15) బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత నామినేష‌న్ దాఖ‌లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‎తో షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మాగంటి సునీత నామినేషన్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. 

ఆమెతో పాటు షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ దాఖలు చేసే ముందు దివంగత నేత, తన భర్త మాగంటి గోపీనాథ్ అనవాయితీ ప్రకారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాగంటి సునీత. అనంతరం తెలంగాణకు భవన్‎కు వెళ్లి అక్కడి నుంచి షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.