
హైదరాబాద్: రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత పులి కలకలం రేపింది. హిమాయత్ సాగర్ వాలంటరీ రీసెర్చ్ ఫ్యూమ్ హౌస్ దగ్గర ఆవులపై దాడి చేసింది. ఒక ఆవు దూడను పట్టి చంపి తింటున్న దృశ్యాలు కలకలం రేపాయి. యజమాని తన ఆవులని కాపాడుకునేందుకు డప్పు శబ్ధం చేయడంతో చిరుతపులి పారిపోయింది. పలుమార్లు చిరుత పులులు తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తుందోనని భయాందోళనలో ఉన్నట్లు చెప్పారు. గతంలోనూ చిలకూరు, రాజేంద్ర నగర్ పరిసరాల్లో చిరుత కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.