
నవీపేట్, వెలుగు : మండలంలోని నందిగామ గుట్టల్లో పశువుల కాపరులకు చిరుత పులి కనిపించడంతో ఫారెస్ట్ ఆఫీసర్ కు సమాచారం ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం ఫారెస్ట్ బిట్ ఆఫీసర్శ్రీధర్ పరిశీలించి చిరుత పులి పాద ముద్రలను గుర్తించారు. గ్రామస్తులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, మళ్లీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు.