వికారాబాద్ అడవుల్లో పులి.. అలర్ట్ చేసిన ఆఫీసర్స్

వికారాబాద్ అడవుల్లో పులి.. అలర్ట్ చేసిన ఆఫీసర్స్

వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో చిరుతపులి కనిపించిందన్న సమాచారం జిల్లాలోని ప్రజలను  భయాందోళనకు గురి చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు నవంబర్ 7న అనంతగిరి హిల్స్ కు వెళ్తుండగా చిరుతపులి కనిపించినట్లుగా తెలిపారు.  

మానెగూడ, గొల్లపల్లి గ్రామాల్లో మామిడితోటలో చిరుతపులులు కనిపించాయని రైతులు తెలిపారు.  దీంతో  అనంతగిరి కొండల్లో చిరుతపులి  సంచరిస్తున్నట్లుగా  స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

అనంతగిరిలో ఎక్కడైనా చిరుతపులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అనంతగిరి కొండల్లో రెండు వేర్వేరు చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.